Home   »  జాతీయం   »   Hero Vijay Antony: విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. వైరల్ అవుతున్న వీడియో..

Hero Vijay Antony: విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. వైరల్ అవుతున్న వీడియో..

schedule ranjith

హీరో విజయ్ ఆంటోని (Hero Vijay Antony) కుమార్తె ఆత్మహత్య సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. చదువుల్లో రాణిస్తూ వుండే మీరా 16 ఏళ్లకే తీవ్ర ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడిన సంగతి మన అందరికి తెలిసిందే.

ప్రధానాంశాలు:

  • విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది
  • విజయ్‌ ఆంటోనీ కుమార్తె మీరా నిన్న ఆత్మహత్య
  • చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్య

Hero Vijay Antony: విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. వైరల్ అవుతున్న వీడియో..

విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె మీరా ఉరేసుకుని చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. చదువు ఒత్తిడి కారణంగానే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది. స్టార్‌ హీరో విజయ్‌ ఆంటోనీ కుమార్తె మీరా నిన్న ఆత్మహత్య చేసుకోగా.. ఆమెకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. చెన్నై చర్చ్‌పార్క్‌ స్కూలులో ఫ్లస్‌ 2 చదువుతున్న ఆమె… కల్చరల్‌ యాక్టివిటీ సెక్రటరీగా నియమించిన సమయంలో ఎంతో కాన్ఫిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేసిన వీడియోను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని.. ఆంటోనీ ధైర్యంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Devil Movie: ‘మాయే చేసి’ సాంగ్‌ గ్లింప్స్ విడుదల.