Home   »  జాతీయం   »   India Passport Rank | 2024 పాస్‌పోర్ట్ ర్యాంకులో ఇండియా స్థానం?

India Passport Rank | 2024 పాస్‌పోర్ట్ ర్యాంకులో ఇండియా స్థానం?

schedule raju

నూతనంగా విడుదలైన గ్లోబల్ పాస్‌పోర్టు ర్యాంకింగ్స్ లలో 62 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే 80వ స్థానంలో ఉంది. పాస్‌పోర్టు ర్యాంకింగ్స్ లో అగ్రగామిగా యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు ఉన్నాయి.

India Passport Rank in 2024 powerful passports

India Passport Rank | హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరు దేశాల పాస్‌పోర్టులు అత్యంత శ‌క్తివంత‌మైన‌వి (Powerful Passports)గా ఉండగా, ఇతర దేశాలతో పోలిస్తే 62 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో భారతదేశం(India Passport Rank) 80వ స్థానంలో ఉంది. అయితే, మునుపటి సంవత్సరం 85వ స్థానంతో 58 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ ఉండగా ఈ సంవత్సరం (2024)లో ఆ సంఖ్య 62కి పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ సింగపూర్‌కు ఉండగా, ఈ దేశంలోని ప్రజలు వీసా లేకుండా 194 దేశాలకు ప్రయాణించడానికి అనుమతిస్తుంది.

భారతదేశం(India Passport Rank)తో సమానంగా ఉజ్బెకిస్తాన్‌ 80వ స్థానంలో ఉండగా, పొరుగున ఉన్న పాకిస్థాన్ 101వ స్థానంలో ఉంది. గత ఐదు సంవత్సరాలుగా పాస్‌పోర్ట్ పవర్‌ ఇండెక్స్ లో అగ్రగామిగా సింగపూర్ మరియు జపాన్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో నాలుగు యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరియు స్పెయిన్‌లు కూడా చేరాయి. ఈ యూరోపియన్ దేశాలు సంయుక్తంగా హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024లో అగ్రస్థానాన్ని పొందాయి. ఇప్పటి వరకు ఉన్న 227 దేశాలలో 194 దేశాలకు ఈ యూరోపియన్ దేశాల పౌరులు వీసా లేకుండా ప్రయాణించడానికి వీలుంటుంది. అయితే, ఈ సంఖ్యలో మునుపటి సంవత్సరంతో పోలిస్తే 3 దేశాలు పెరిగాయి.

2024లో టాప్ 10 Powerful Passports జాబితా | India Passport Rank :

  • మొదటి స్థానంలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ (194 గమ్యస్థానాలు)
  • రెండవ స్థానంలో ఫిన్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ (193 గమ్యస్థానాలు)
  • 3వ స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ (192 గమ్యస్థానాలు)
  • 4వ స్థానంలో బెల్జియం, లక్సెంబర్గ్, నార్వే, పోర్చుగల్, యునైటెడ్ కింగ్‌డమ్ (193 డెస్టినేషన్స్)
  • 5వ స్థానంలో గ్రీస్, మాల్టా, స్విట్జర్లాండ్ (190 గమ్యస్థానాలు)
  • 6వ స్థానంలో చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్, పోలాండ్ (189 గమ్యస్థానాలు)
  • 7వ స్థానంలో కెనడా, హంగేరి, యునైటెడ్ స్టేట్స్ (188 గమ్యస్థానాలు)
  • 8వ స్థానంలో ఎస్టోనియా, లిథువేనియా (187 గమ్యస్థానాలు)
  • 9వ స్థానంలో లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (186 గమ్యస్థానాలు)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గత దశాబ్ద కాలంలో అత్యంత వేగంగా 11వ స్థానానికి ఎగబాకి, వీసా లేకుండా 183 గమ్యస్థానాలకు యాక్సెస్‌ను అందిస్తోంది. చైనా, ఈ ఏడాది రెండు స్థానాలు ఎగబాకి 62వ స్థానానికి చేరుకుంది. 85 గమ్యస్థానాలకు వీసా రహిత యాక్సెస్‌ను కలిగి ఉంది.

Also Read: నవంబర్ 4 & 18 తేదీల్లో ప్రత్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్‌లు