Home   »  జాతీయం   »   3 రోజుల పాటు జరగనున్న ఇండియా-శ్రీలంక బిజినెస్ సమ్మిట్

3 రోజుల పాటు జరగనున్న ఇండియా-శ్రీలంక బిజినెస్ సమ్మిట్

schedule mahesh

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీలంకలో పర్యటించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

“NAAM 200″ కార్యక్రమంలో ప్రసంగించనున్న సీతారామన్

నవంబర్ 2న సుగతదాస ఇండోర్ స్టేడియంలో భారత సంతతి తమిళులు శ్రీలంకకు వచ్చి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం నిర్వహిస్తున్న “NAAM 200″ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ముఖ్య గౌరవ అతిథిగా ప్రసంగించనున్నారు.

కొలంబోలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్దన, శ్రీలంక నీటి సరఫరా మరియు ఎస్టేట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రి జీవన్ తొండమాన్, రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు మరియు అనేక ఇతర ప్రముఖులు “NAAM 200” కు హాజరుకాబోతున్నారు.

India-Sri Lanka బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొననున్న నిర్మలా సీతారామన్

భారత రాజకీయ పార్టీల నుండి ఇతర ఆహ్వానితులు మరియు మలేషియా తమిళ కాంగ్రెస్ ప్రతినిధి ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది

ఇండియా-శ్రీలంక (India-Sri Lanka) బిజినెస్ సమ్మిట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘కనెక్టివిటీని పెంపొందించడం శ్రేయస్సు కోసం భాగస్వామ్యం’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. భారత్-శ్రీలంక వ్యాపార సదస్సును భారత పరిశ్రమల సమాఖ్య , ఇండో-లంక సంయుక్తంగా నిర్వహిస్తోంది.