Home   »  జాతీయం   »   పంచదార ఎగుమతులపై నిషేధం విధించబోతున్న భారత్..

పంచదార ఎగుమతులపై నిషేధం విధించబోతున్న భారత్..

schedule mounika

పంచదార ఎగుమతులపై నిషేధం విధించబోతున్న భారత్.. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే కొత్త సీజన్లో విదేశాలకు పంచదార ఎగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం వల్ల చెరుకు ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 30తో ముగియనున్న ప్రస్తుత సీజన్ లో 6.1 మిలియన్ టన్నుల పంచదార ఎగుమతికి మాత్రమే షుగర్ మిల్లులకు అనుమతి ఉంది..వచ్చే సీజన్ లో విదేశాలకు ఎగుమతి చేసేంత మిగులు పంచదార మన వద్ద ఉండదని చెప్పాయి. గత ఏడాది వచ్చిన 31.7 మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో పోల్చితే ఈ సారి 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఉత్పత్తి 3.4 శాతం తగ్గుతుందని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఆదిత్య జున్‌జున్‌వాలా అంచనా వేశారు. చెరుకును ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పండిస్తారు.జూన్‌లో సరైన వర్షాలు పడలేదు. దీని వల్ల చెరకు సాగుపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.