Home   »  జాతీయం   »   యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ ఆర్మీ… 5గురు ఉగ్రవాదులు హతం..!

యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ ఆర్మీ… 5గురు ఉగ్రవాదులు హతం..!

schedule mahesh

జమ్మూ&కశ్మిర్ : జమ్మూ కశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ చేపట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో (Terror Operation) ఈ రోజు ఐదుగురు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం.

indian-army-has-undertaken-anti-terror-operation

Terror Operation లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం

సరిహద్దు భద్రతా దళ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజులుగా జమ్మూ కశ్మీర్ లో భారత్, పాక్ సరిహద్దు వెంబడి సైనికులు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా భారత సైనికులు సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా కుల్గాం జిల్లాలో సైన్యానికి , టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారత సైన్యం “ఐదుగురు” ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

కుల్గామ్ పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి చేపట్టిన ఆపరేషన్

ఈ ఆపరేషన్ ను కుల్గామ్ పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి చేపట్టారు. ఉగ్రవాదుల నుండి విధ్వంసకర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు తప్పించుకోకుండా భద్రతా దళాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. కుల్గామ్‌లోని దమ్‌హాల్ హంజి పోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ X లో పోస్ట్ చేయడం జరిగింది.

అక్టోబర్‌లో కుల్గామ్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయని తెలిపారు. ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించి శుక్రవారం తెల్లవారు జామున కాల్పులు జరిపినట్లు తెలిపారు. అక్టోబర్‌లో కుల్గామ్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వీరికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు.