Home   »  జాతీయం   »   ISIS |ముగ్గురు అనుమానిత ISIS ఉగ్రవాదుల అరెస్ట్

ISIS |ముగ్గురు అనుమానిత ISIS ఉగ్రవాదుల అరెస్ట్

schedule mahesh

బెంగుళూరు : NIA మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్‌లో ఉన్న ముగ్గురు అనుమానిత ఐసిస్ (ISIS) ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల యాంటీ టెర్రర్ ఆపరేషన్ టీమ్ అరెస్టు చేసింది. కర్ణాటకలోని హుబ్బళి పశ్చిమ కనుమలలో ఉగ్రవాద క్యాంపులు ఏర్పాటు చేసి దేశంలో పేలుళ్లకు ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

అరెస్టు అయినా వారు షానవాజ్, మహ్మద్ రిజ్వాన్, అర్షద్ వార్సీగా గుర్తింపు (ISIS)

పోలీసులు అరెస్టు చేసిన వారిని షానవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ అర్షద్ వార్సీగా గుర్తించారు. వీరిలో ఒకరైన షానవాజ్‌ను రెండు రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేసినప్పటికీ అరెస్టును అధికారికంగా తెలుపలేదు. ఈ మేరకు పోలీసులు నిన్న సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేసారు.

దేశంలో ఉగ్రదాడులు చేయాలనీ నిర్ణయం

అరెస్ట్ అయినా వారంతా కలిసి కర్ణాటకలోని హుబ్బళి- ధారవాడ పశ్చిమ కనుమల ప్రాంతంలో తమ స్థావరాలను ఏర్పరచుకుని ఆ తర్వాత దేశంలో ISIS ఉగ్రవాదుల శబిరాలని విస్తరించి ఉగ్రదాడులు చేసి దేశంలో అశాంతి నెలకొల్పాలనే పథకం వేశారని పోలీస్ అధికారులు తెలిపారు.

అనుమానిత ఉగ్రవాదులందరు ఇంజనీర్లే

అందుకే దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాలను తనిఖీ చేశామని ఢిల్లీ స్పెషల్ సెల్ ఆఫీసర్ ధాలివాల్ అన్నారు. ఇందులో నమ్మలేని విషయం ఏంటి అంటే ఉగ్రవాదులందరు ఇంజనీర్లు కాగా వారిలో వార్సీ అనే వ్యక్తి పీహెచ్‌డీ కూడా చేస్తున్నాడని తెలిపారు. వీరంతా బాంబు తయారీలో మంచి నిష్ణాతులని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ లు తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో ఎన్ఐఏ షానవాజ్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాద అనుమానితులైన రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ దియాపర్వాలా, తల్హా లియాఖత్ ఖాన్ గురించి వివరాలు తెలిపితే NIA ఒక్కొక్కరికి రూ 3 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. వీరిలో డయాపర్వాల, తల్హా ఇంకా చిక్కలేదని పోలీసు అధికారులు తెలిపారు. వారి కోసం ఇంకా వెతుకుతున్నామని తెలిపారు.