Home   »  జాతీయం   »   శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

schedule raju

చంద్రయాన్‌-3 ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా రేపు ఆదిత్య-L1 ప్రయోగం చేపట్టనున్న నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాకెట్‌ నమూనాతో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి సారిగా సూర్యునిపై అధ్యయనానికి రేపు ఉదయం 11.50 గంటలకు ఇస్రో ఆదిత్య-L1 ప్రయోగం చేపట్టనుండగా.. ఇప్పటికే కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

చంద్రయాన్-3 సూక్ష్మ నమూనాలను ఉపయోగించి వెంకటేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజను నిర్వహించారు. ఇప్పుడు ఆదిత్య-L1 ప్రయోగం ముందు కూడా ఇస్రో సైంటిస్టులు చేస్తుండడంతో రేపటి ప్రయోగం కూడా సూపర్‌ సక్సెస్‌ అవుతుందని భక్తులు అంటున్నారు.

ఆదిత్య-ఎల్1 భూమికి దాదాపు 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న ఫస్ట్ లాగ్రాంజియన్ పాయింట్ వరకు వెళుతుందని, అందులోని చాలా డేటాను అంతరిక్షంలోని ప్లాట్‌ఫారమ్ నుంచి మొదటిసారిగా శాస్త్రీయ సమాజానికి అందజేస్తుందని సౌర భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ దీపాంకర్ బెనర్జీ తెలిపారు.