Home   »  జాతీయం   »   DMK ఎంపీ జగత్రక్షకన్‌కు చెందిన 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు

DMK ఎంపీ జగత్రక్షకన్‌కు చెందిన 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు

schedule mahesh

చెన్నై: చెన్నై లోని DMK ఎంపీ C.S జగత్రక్షకన్‌కు చెందిన 40 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ ఈ రోజు సోదాలు నిర్వహిస్తోంది.

DMK ఎంపీ జగత్రక్షకన్ ఆస్తులపై ఐటీ దాడులు

జగత్రక్షకన్ నివాసం, అడయార్‌లోని అరక్కోణం నియోజకవర్గంలోని కార్యాలయం, పూనమల్లి సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి, టి నగర్‌లోని హోటల్‌తో పాటు ఆయనకు చెందిన ఇతర ఆస్తులు స్కానర్‌లో ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. డీఎంకే ఎంపీ జగత్రక్షకన్ కి చెందిన ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం ఇది తొలిసారి కాదు.

తొలిసారి 2016లో జగత్రక్షకన్ ఆస్తులపై 37 చోట్ల IT దాడులు

2016 లో పుదుచ్చేరిలో మూడు చోట్ల, తమిళనాడులోని 37 చోట్ల, ఎక్కువగా చెన్నై దాని చుట్టుపక్కల, కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రికి చెందిన 40 స్థలాలపై శాఖ IT దాడులు నిర్వహించింది. జగత్రక్షకన్ విద్య, వ్యాపార రంగాలను కలిగి వున్నాడు. జగత్రక్షకన్ కు చెందిన భారత్ యూనివర్శిటీ , శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, శ్రీ లక్ష్మీ నారాయణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి వివిధ విద్యాసంస్థలు ఉన్నాయి.

అంతేకాకుండా జగత్రక్షకన్ కు మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఎలైట్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ DMK జగత్రక్షకన్ కుటుంబానికి చెందినది. డిఎంకె M.P ఎస్ జగత్రక్షకన్ ఆవరణలో జరిగిన రాజకీయ యాత్రపై ఐటి శాఖ దాడులు చేసింది.

40 కి పైగా చోట్లలో IT అధికారులు సోదాలు

జగత్‌రక్షకన్‌ ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. రాజధాని చెన్నైతోపాటు కోయంబత్తూరు, వేలూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా చోట్ల అధికారులు సోదాలు జరుపుతున్నారు. జగత్‌రక్షకన్‌కు చెందిన విద్యాసంస్థల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. దీంతోపాటు చెన్నైలోని పలు హోటళ్లు, ప్రైవేట్‌ దవాఖానలపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు.