Home   »  జాతీయం   »   JODO YATRA|భారత్ జోడో యాత్రను ప్రారంభించిన యూత్ కాంగ్రెస్

JODO YATRA|భారత్ జోడో యాత్రను ప్రారంభించిన యూత్ కాంగ్రెస్

schedule mahesh

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలలో చురుకుగా పాల్గొనాలనుకునే యువతను ఆహ్వానించడానికి భారత యూత్ కాంగ్రెస్ (BYC) ఈ రోజు ఉదయం భారత్ JODO YATRA కార్యక్రమాన్ని ప్రారంభించింది.

భారత్ జోడో యాత్ర ప్రారంభించి సంవత్సరం అవుతున్న సందర్బంగా యూత్ కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

రాబోయే మూడు నెలల్లో భారత్ JODO YATRA ను జరుపుకోవడానికి యూత్ కాంగ్రెస్ BYC వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది.

వీటిలో పాదయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫోటో ఎగ్జిబిషన్, క్రీడా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఉంటాయని తెలిపారు.

ఆలిండియా కాంగ్రెస్ (AICC) కమిటీ ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో భారత్ జోడో పాదయాత్ర నిర్వహిస్తుంది.

మేము యాత్ర సందేశాన్ని ప్రజలకు వివరించి చెప్తామని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న BJP ప్రభుత్వం ప్రజలకి చేస్తున్న మోసాలను ప్రజలలోకి తీసుకెళ్తామని తెలిపారు.

వీటితో పాటు యువజన కాంగ్రెస్ క్రీడా కార్యక్రమాలు మరియు రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తుందని BYC తెలిపింది.

అంతే కాకుండా అధికార BJP పార్టీ లక్షల కోట్ల ప్రాజెక్ట్ లని ప్రధాని తన స్నేహితులకి దోచి పెడుతున్నదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల పై అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయో చెప్పే ధైర్యం వారికి ఎప్పుడు వస్తుందని,

మణిపూర్‌ని ఎలా తగల బెట్టారో చెప్పే దమ్ము ఎప్పుడు ఉంటుందని యూత్ కాంగ్రెస్ మండి పడింది.

మణిపూర్‌లో ఏమి జరిగిందో మీరు చూశారా, మణిపూర్ గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని,

దేశంలో ఒక రాష్ట్రం కాలిపోతున్నప్పుడుదేశ ప్రధాని మాట్లాడకపోవడం ప్రజలని, దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని భారతీయ యూత్ కాంగ్రెస్ నేతలు ప్రధాని పై విరుచుకుపడ్డారు.

2022లో ఇదే రోజున దేశంలోని దక్షిణాదిన ఉన్న తమిళనాడులోని కన్యాకుమారిలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రను ప్రారంభించి ఈ ఏడాది జనవరి 30న శ్రీనగర్‌లో యాత్ర ముగించారు.