Home   »  జాతీయం   »   ఇస్రో శాస్త్రవేత్తల ను అభినందించిన కర్ణాటక ముఖ్యమంత్రి

ఇస్రో శాస్త్రవేత్తల ను అభినందించిన కర్ణాటక ముఖ్యమంత్రి

schedule raju

చంద్రుడిపై అన్వేషణకు పలు దేశాలు ప్రయోగాలు చేపట్టినా… మూడు దేశాలు మాత్రమే చంద్రమండలంపై అడుగుపెట్టగా ఇప్పుడు ఆ ఘనతను భారత్సాధించింది. ఇంతకు ముందు సోవియట్‌ యూనియన్‌, అమెరికా, చైనాలు జాబిల్లి ఉపరితలానికి చేరుకున్నాయి. అయితే ఆ మూడూ భూమికి కన్పించే ఉత్తర ధ్రువంవైపు చంద్రుడిపై అడుగుపెట్టగా… మన చంద్రయాన్‌-3 మాత్రం ఇప్పటిదాకా మానవాళికి కనిపించని దక్షిణ ధ్రువాన్ని చేరుకుంది. దీని వెనుక ఇస్రో శాస్త్రవేత్తల సుదీర్ఘ కృషి, కష్టం ఉన్నాయి. అందుకే ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. 

దింతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాస్త్రవేత్తలకు తన ప్రశంసలు పంపారు. దేశానికి చంద్రుని మిషన్‌లో ఇది ‘ల్యాండ్‌మార్క్ అచీవ్‌మెంట్’ అని ఆయన పేర్కొన్నారు. “చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు @isroకి అభినందనలు. ఇది భారతదేశానికి గర్వకారణమైన క్షణం మరియు చంద్రుని మిషన్‌లో ఒక మైలురాయి విజయం. అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.