Home   »  జాతీయం   »   బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డ కేజ్రీవాల్

బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డ కేజ్రీవాల్

schedule mahesh

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతలపై బీజేపీ తప్పుడు, కల్పిత కేసులు పెట్టడమే కాకుండా వ్యాపారవేత్తలపై కేంద్ర ఏజెన్సీలను కూడా వాడుకుంటుందన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) ఈ రోజు మరోసారి ఆరోపించారు.

సంజయ్ సింగ్ అరెస్టుపై కేంద్రాన్ని నిందించిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ (Kejriwal)

రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుపై కేంద్రాన్ని నిందించిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం అనేది పూర్తిగా అబద్ధని తమ వద్ద ఒక చిన్న సాక్ష్యం కూడా లేదని, ప్రతిదీ నిరాధారమని అన్నారు.

సుప్రీం కోర్టు చెప్పింది విన్నారా, మద్యం కుంభకోణం మొత్తం అబద్ధం

ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ సైట్‌లో కేజ్రీవాల్ మీడియాతో మాట్లడుతు ED మమ్మల్ని చాలా విచారించారు. ఏదైనా బయటకు వచ్చిందా నిన్న సుప్రీం కోర్టు చెప్పింది విన్నారా, మద్యం కుంభకోణం మొత్తం అబద్ధం, ఒక్క పైసా కూడా మార్పిడి జరగలేదు.

మద్యం కుంభకోణంపై సీఎం కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో బీజేపీ మహిళా కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కొద్ది రోజుల్లో, మద్యం కుంభకోణం మూసివేయబడుతుంది. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం ద్వారా వారిలో భయాందోళనలు రేకెత్తించి, వారిని బీజేపీలోకి ఎలా తీసుకువస్తారో యావత్ దేశం చూస్తోందని అన్నారు.

రాజకీయ నాయకులే కాకుండా వ్యాపారవేత్తలను కూడా టార్గెట్ చేస్తున్నారు

ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాజకీయ నాయకులే కాకుండా వ్యాపారవేత్తలను కూడా టార్గెట్ చేస్తున్నారు. గత ఐదేళ్లలో దాదాపు 12 నుంచి 13 లక్షల మంది అధిక నికర విలువగల వ్యక్తులు, భారీ పెట్టుబడులు పెట్టి ప్రజలకు ఉపాధి కల్పించిన వారు భారతదేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

వారి వెనుక ఈడీ, ఐటీ, సీబీఐని కూడా పంపారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. దేశంలో రాజకీయాల్లోనే కాకుండా వ్యాపారంలో కూడా భయాందోళన వాతావరణాన్ని సృష్టించారు. ఇలాంటి భయానక వాతావరణం దేశ ప్రగతికి మంచిది కాదు. మీరు పెద్ద పరిశ్రమలను నడపడానికి అనుమతించనప్పుడు, అవి మూతపడుతున్నాయి. మనం ఏజెన్సీ ఆటలు ఆడుతూనే ఉంటే దేశం ఎలా పురోగమిస్తుంది. పరిశ్రమలు, వ్యాపారాలు పురోగమించేలా చర్యలు తీసుకోవాలి అప్పుడే దేశం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.