Home   »  జాతీయం   »   Kerala CM |మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమావేశం…!

Kerala CM |మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమావేశం…!

schedule mahesh

కేరళ : Kerala CM పినరయి విజయన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై చర్చించేందుకు కేరళలోని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) ఈ రోజు సమావేశం కానుంది. క్యాబినేట్ పునర్వ్యవస్థీకరణ ఫై చర్చలు జరుపనున్నారు.

2021లో ప్రస్తుతం ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మంత్రి పదవులని పంచుకునే ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఈ రోజు క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్న ఆంటోని రాజు రొడ్డు రవాణా శాఖను,

అహ్మద్ దేవరకోవిల్ ఓడరేవుల శాఖను కొత్త వారికి కేటాయించారు. వీరి ఒప్పందం ప్రకారం 30 నెలల పదవీకాలం పూర్తయ్యింది.

ఈ ఇద్దరి మంత్రుల స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు.

ఆంటోని రాజు స్థానంలో కె.బి. గణేష్ కుమార్, దేవరకోవిల్ స్థానంలో కదనపల్లి రామచంద్రన్ మంత్రి పదవులు పొందనున్నారు.

అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) లోని వర్గాల సమాచారం ప్రకారం ఒప్పందాన్ని గౌరవించడం,

సీపీఐ(ఎం) నాయకుల శాఖలలో కూడా మార్పు తీసుకురావడానికి Kerala CM పినారయి విజయన్ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు.

సీపీఐ(ఎం)కు చెందిన ఏ మంత్రీ పదవిని కోల్పోయినట్లు వార్తలు రాకపోయినా… జర్నలిస్టుగా మారిన రాజకీయవేత్త వీణా జార్జ్ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కవగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది.

అదే విదంగా జరిగితే ఆమె కేరళ రాష్ట్ర శాసనసభకు తొలి మహిళా స్పీకర్‌గా అవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

వీణ జార్జ్‌ స్పీకర్‌గా బాధ్యతలు తీసుకుంటే ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న AN శ్యాంసీర్‌ కేబినెట్‌ మంత్రి పదవి పొందనున్నారు.

వీణ జార్జ్‌తో సహా సీపీఐ(ఎం)కి చెందిన 10 మంది రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతుండగా వారికి ఎలాంటి అనుభవం లేకపోవడంతో మొదటి నుంచీ క్యాబినెట్ మంత్రుల ఎంపిక పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

10 మందిలో ఐదుగురు మొదటిసారి ఎమ్మెల్యేలు కాగా అందులో కె.ఎన్.బాలగోపాల్ (ఆర్థిక), పి. రాజీవ్ (పరిశ్రమలు), ఆర్. బిందు (ఉన్నత విద్య), ఎం. బి. రాజేష్ (స్థానిక స్వపరిపాలన), మంత్రులుగా కొనసాగుతున్నారు.

ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం బాలగోపాల్, రాజీవ్, రాధాకృష్ణన్, రియాస్, బిందు కలిగి ఉన్న ప్రధాన పోర్ట్‌ఫోలియోలలో ఎటువంటి మార్పు ఉండదు.

విజయన్ సన్నిహితులుగా పరిగణించబడుతున్న వాసవన్, సాజి చెరియన్‌లకు పెద్ద బాధ్యతలు అప్పగించబడవచ్చు.

2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన విధేయతను కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ నుండి ఎల్‌డిఎఫ్‌కి మార్చిన

మాజీ రాష్ట్ర మంత్రి గణేష్ కుమార్, పోర్ట్‌ఫోలియో పునర్విభజన పై ఎటువంటి సమస్య ఉన్నట్లు కనిపించడం లేదు.