Home   »  జాతీయం   »   Madhya Pradesh |మహిళలకి రక్షణ లేని మధ్యప్రదేశ్: కాంగ్రెస్

Madhya Pradesh |మహిళలకి రక్షణ లేని మధ్యప్రదేశ్: కాంగ్రెస్

schedule mahesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం పై ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మానసిక వికలాంగురాలైన మైనర్ బాలిక పై లైంగిక వేధింపులు జరగటం, ఆ బాధితురాలు సహాయం కోరుతూ పాక్షిక నగ్న స్థితిలో సహాయం చేయండి అంటూ అడుగుతుంటే ఎవరు పట్టించుకోకపోవటం ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అవమానం కలిగించిందన్నరు.

దేశంలోనే మహిళలకి అత్యంత అసురక్షిత రాష్ట్రంగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh)

దేశంలోనే మహిళలకి అత్యంత అసురక్షిత రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మారిందని కాంగ్రెస్ పేర్కొంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని దూషిస్తూ ట్విట్టర్ ‘X’ పోస్ట్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ ఉజ్జయినిలోని మహాకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలిక బాధితురాలిగా మారింది.

ఆ అమ్మాయి రక్తంతో తడిసి, రెండున్నర గంటలపాటు అర్ధ నగ్న స్థితిలో వీధుల్లో తిరుగుతూనే ఉందని అన్నాడు. కానీ ప్రభుత్వం యొక్క పోలీసులు, ప్రభుత్వం నిద్రపోయింది.

ఈ హృదయ విదారక సంఘటన మరోసారి మధ్యప్రదేశ్, యావత్ దేశానికి సిగ్గు తెచ్చేలా ఉంది. కానీ మహిళల పై నేరాల విషయంలో బీజేపీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు తప్ప ఆడ కూతుళ్లకు చేసింది ఎం లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు.

వికలాంగురాలైన మైనర్ బాలిక పై అత్యాచారం Madhya Pradesh

వికలాంగురాలైన మైనర్ బాలిక పై అత్యాచారం జరిగిన తర్వాత ఆమె సహాయం కోరుతూ రోడ్డు పక్కన పాక్షిక నగ్న స్థితిలో, రక్తస్రావంతో ఉన్న బాధితురాలు సహాయం కోసం ఒక వ్యక్తిని సహాయం కోరగా అతను ఆమెను దూరంగా నెట్టివేయటం, వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఆమె సహాయం కోసం అనేక తలుపులు తట్టింది కానీ ఎవరూ కనికరం చూపలేదు. చివరికి ఆమె ఒక ఆశ్రమానికి చేరుకుంది.

అక్కడున్న ఒక పూజారి ఆమెను లైంగిక వేధింపుల కేసుగా అనుమానించి టవల్‌తో కప్పి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాధితురాలికి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆమె ప్రైవేట్ భాగాలూ బాగా దెబ్బతిన్నందున వైద్యులు శస్త్రచికిత్స కోసం ఆమెను ఇండోర్‌కు తరలించారు.

ఆమె బతికేందుకు అత్యవసరంగా రక్తమార్పిడి చేయాల్సిన అవసరం ఉన్నందున ఒక పోలీసు రక్తదానం చేశాడని ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.