Home   »  జాతీయం   »   Mallikarjun |మహారాష్ట్ర ఆసుపత్రిలోని మరణాల ఫై విచారణకు కాంగ్రెస్ డిమాండ్

Mallikarjun |మహారాష్ట్ర ఆసుపత్రిలోని మరణాల ఫై విచారణకు కాంగ్రెస్ డిమాండ్

schedule mahesh

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన 24 మరణాల పై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun) మహారాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పై విమర్శలు కురిపించారు.

నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజే 12 మంది శిశువులతో సహా 24 మరణాలు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి నిన్న తెలిపారు.

మరణాల పై తన ఆందోళనను వ్యక్తం చేసిన ఖర్గే (Mallikarjun)

నాందేడ్ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది శిశువులతో సహా 24 మంది మరణించారు. ఈ మరణాల ఫై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షడు ఖర్గే మహారాష్ట్ర ప్రభుత్వం ఫై ట్విట్టర్ ఎక్స్‌ పోస్ట్‌లో మండి పడ్డారు. మరణాల పై తన ఆందోళనను వ్యక్తం చేశారు.

ఈ రోగులకు మందులు, సరైన చికిత్స లేకపోవడం వల్ల మరణించారని అన్నారు. 2023 ఆగస్టులో థానేలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే విధమైన ఘటన జరిగింది. అప్పుడు 18 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు, అని ఖర్గే అన్నారు.

బిజెపి-శివసేన ప్రభుత్వం ఫై మండి పడ్డా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

మరణించిన బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. పదేపదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్న మహారాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పై పలు సందేహాలు లేవనెత్తుతున్నాయని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మహారాష్ట్రలోని బిజెపి-శివసేన ప్రభుత్వం ఫై మండి పడ్డారు.

ఈ నిర్లక్ష్యానికి కారణమైన దోషులను న్యాయవ్యవస్థ కఠినంగా శిక్షించేలా సమగ్ర దర్యాప్తును మేము డిమాండ్ చేస్తున్నామని ఖర్గే అన్నారు.

మరణ వార్తల పై సంతాపాన్ని వ్యక్తం చేసిన రాహుల్

అధికార బీజేపీ ప్రభుత్వం ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే పిల్లల మందులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని, బీజేపీ దృష్టిలో పేదల ప్రాణాలకు విలువ లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిన్న రాత్రి ఆరోపించారు. ఎక్స్‌లో పోస్ట్‌లో రాహుల్ గాంధీ మరణ వార్తలపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా అపరిమితమైన మరణాలకు కారణమైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని , బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.