Home   »  జాతీయం   »   Manipur: మోరేలో హెలిప్యాడ్‌ను తనిఖీ చేయడానికి వెళ్లిన SDPO మృతి ..

Manipur: మోరేలో హెలిప్యాడ్‌ను తనిఖీ చేయడానికి వెళ్లిన SDPO మృతి ..

schedule ranjith

మణిపూర్‌ (Manipur) లో హింస ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడు తెంగ్నౌపాల్ జిల్లాలోని మోరేలో ఒక పోలీసు అధికారి (SDPO) అనుమానిత ఉగ్రవాదులచే కాల్చి చంపబడ్డాడు. ఈ మేరకు మణిపూర్ పోలీసులు వెల్లడించారు.

Manipur మిలిటెంట్ల గుంపు పోలీసులపై దాడి

కుకీ కమ్యూనిటీ ప్రాబల్యం ఉన్న సరిహద్దు పట్టణంలో కొత్తగా నిర్మించిన హెలిప్యాడ్‌ను పోలీసు అధికారులు తనిఖీ చేస్తుండగా మిలిటెంట్ల గుంపు పోలీసులపై దాడి చేయడంతో మోరే SDPO చింగ్తం ఆనంద్ బుల్లెట్‌తో గాయపడ్డారని సీనియర్ అధికారి తెలిపారు.

ఉగ్రవాదులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం

కాల్పులు జరిపిన అనంతరం SDPO ను మోరేలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ
చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు అధికారి తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు.

10 మందికి పైగా మయన్మార్ జాతీయుల అరెస్టు

సరిహద్దు పట్టణం మోరే నుండి భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని అనేక పౌర మరియు సామాజిక సంస్థలు డిమాండ్ చేసిన వారాల తర్వాత ఈ సంఘటన జరిగింది. మెయిటీ కమ్యూనిటీకి చెందిన ఒక పాడుబడిన ఇంటి నుండి ఫర్నిచర్ మరియు ఇతర గృహోపకరణాలను దొంగిలించి, చట్టవిరుద్ధంగా భారత భూభాగంలోకి ప్రవేశించినందుకు 10 మందికి పైగా మయన్మార్ జాతీయులను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

దగ్ధమైన ఇళ్లలో ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులు దొంగతనం

మే నెలలో మణిపూర్ రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండలో దగ్ధమైన ఇళ్లలో ఫర్నిచర్ మరియు ఎలక్ట్రికల్ వస్తువులను దొంగిలించారనే ఆరోపణలపై అక్టోబర్ 21న ముగ్గురు మయన్మారీస్ అరెస్టు పై ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ స్పందిస్తూ ఇది కొన్ని సంస్థల పనిగా అభివర్ణించారు.

Also Read: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్… 5 షరతులతో మధ్యంతర బెయిల్..!