Home   »  జాతీయం   »   MLC Kavitha | అమ్మవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

MLC Kavitha | అమ్మవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

schedule sirisha

MLC Kavitha | అస్సాం రాష్ట్రం గౌహతిలోని గువ‌హ‌టిలో ఉన్న కామాఖ్య అమ్మవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం దర్శించుకున్నారు.

ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న క‌విత‌కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. కామాఖ్య ఆల‌యంలో మంత్రోచ్చారణతో ప్ర‌త్యేక పూజ‌లు, హోమాలు చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాల‌ని ప్రార్థించానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని MLC Kavitha స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ని మరోసారి భారీ మెజారిటీ తో ప్రజలు గెలిపిస్తారని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ పచ్చగా ఉంటుందని అందుకే BRS పార్టీ గెలవాలని ప్రార్ధించానని ఆమె అన్నారు.

ఈసారి ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలవాలని ప్రత్యేక పూజలు చేయించి, చుట్టుపక్కల ఉన్న మిగతా ఆలయాలను కూడా దర్శించి భక్తి పారవశ్యంలో మునిగిని పోయానని కవిత వెల్లడించారు.

నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక సారి అమ్మ వారిని దర్శించుకున్నానని, తాజాగా కామాఖ్య దేవిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉందన్నారు.

అమ్మ వారి దగ్గర భక్తి తో దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. అందుకే మళ్ళి దేవిని దర్శించుకోవడాని వచ్చానని అన్నారు.

ఆధ్యాత్మికత లో భారతదేశం విరజిల్లుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉందని ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైన అస్సాం లో ఉన్న కామాఖ్య దేవిని దర్శించుకునే భాగ్యం త‌న‌కు కలగడం సంతోషంగా ఉందని చెప్పారు.

శక్తి, విశ్వాసం మరియు భక్తికి దీవించే కామాఖ్య దేవి ఆలయం యొక్క దైవిక ప్రకాశంలోకి అడుగు పెట్టడం.

ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల క్షేమం, ఆరోగ్యకరమైన జీవితం మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థించాను” అని కవిత ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

అనంతరం కామారెడ్డిలో, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ కూతురు ప్రియాంక,

నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ కుమారుడు కృష్ణ చైతన్యల వివాహానికి హాజరై వధూ వరులను ఆశీర్వదించారు.