Home   »  జాతీయం   »   ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరంను ప్రారంభించిన మోదీ

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరంను ప్రారంభించిన మోదీ

schedule mahesh

వారణాసి: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్వేద్ మహామందిర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ (Modhi inaugurated) సోమవారం వారణాసిలో ప్రారభించడం జరిగింది. ఈ యోగా కేంద్రంలో ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసుకోవచ్చు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ U.P సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఈ యోగా కేంద్రాన్ని సందర్శించారు.

Modhi inaugurated

ఏడు అంతస్తుల భవనంలో నిర్మించబడిన స్వర్వేద్ మహామందిర్‌

స్వర్వేద్ మహామందిర్ ఏడు అంతస్తుల భవనంలో నిర్మించబడింది. మహామందిర్ గోడలపై స్వర్వేద శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి. ప్రధాని మోదీ ఆలయాన్ని సందర్శించి విహంగం యోగా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఈ ఉత్సవాల్లో మోదీ పాల్గొనడం ఇది రెండోసారి. దీనికి ముందు డిసెంబర్ 2021లో మొదటిసారి పాల్గొన్నాడు.

స్వర్వేద్ మహామందిర్‌ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ (Modhi inaugurated)

19వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మికవేత్త, కవి మరియు ఋషి సద్గురు సదాఫల్ డియోజీ మహారాజ్ విహంగం యోగ్ సంస్థాన్‌ను స్థాపించారు. యోగా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇప్పుడు వారణాసి అంటే అభివృద్ధి, వారణాసి అంటే ఆధునిక సౌకర్యాలతో పాటు పరిశుభ్రత, మార్పు మరియు నమ్మకం అని అన్నారు.

కాశీ ప్రజలు అభివృద్ధి నిర్మాణంలో సరికొత్త రికార్డులు సృష్టించారన్న మోదీ

సాధువుల మార్గదర్శకత్వంలో కాశీ ప్రజలు అభివృద్ధి నిర్మాణంలో సరికొత్త రికార్డులు సృష్టించారన్నారు. ఈనాడు స్వర్వేద్ మహామందిర్ దీనికి మంచి ఉదాహరణగా చెప్పబడుతుంది. తాను మహామందిర్‌ను సందర్శించినప్పుడు మంత్రోచ్ఛారణతో పరవశించిపోయానన్నారు. స్వర్వేద్ మహామందిర్ గోడలపై వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, గీత, మహాభారతాల దివ్య బోధనలు చిత్రించారని తెలిపారు.

Also Read: అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీంపై విష ప్రయోగం..!