Home   »  జాతీయం   »   Modi fire |రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడిన ప్రధాని మోదీ

Modi fire |రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడిన ప్రధాని మోదీ

schedule mahesh

రాజస్థాన్‌: ఈ రోజు రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ లో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఫై మండి పడ్డారు. (Modi fire) కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రారంభించిన పథకాలను ఆపవద్దని గెహ్లాట్ ఇప్పటికే తనను అభ్యర్థించడం ద్వారా ఓటమిని అంగీకరించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్ లో బిజెపి ఏ పథకాన్ని ఆపదని ఇంకా మెరుగుపరచడానికి మాత్రమే ప్రయత్నిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వ కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్న మోదీ

బిజెపి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఏ పథకాన్ని ఆపబోమని మోడీ హామీ ఇవ్వాలని సీఎం అశోక్ గెహ్లాట్ డిమాండ్‌ పై మోదీ (Modi fire) మాట్లాడుతూ ప్రధాని కాంగ్రెస్ ప్రభుత్వ కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అశోక్ గెహ్లాట్‌కు తెలుసని అందుకే పథకాలను ఆపవద్దని బహిరంగంగా అభ్యర్థించడం ద్వారా ఆయన ఒక విధంగా బిజెపిని అభినందించారు.

రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గుర్తు “కమలం” పైనే పోటీ చేస్తుందన్న మోదీ

రాజస్థాన్ లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగిన ఒక బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన నరేంద్ర మోడీ, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించబోమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గుర్తు కమలం పైనే పోటీ చేస్తుందని చెప్పారు.

రాజస్థాన్ బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సిపి జోషి, ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్, కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ ఈ ర్యాలీలో పాల్గొన్నరు. రాజస్థాన్‌లో బీజేపీ వసుంధర రాజేను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తుందా లేదా అనే ఊహాగానాలు చాలా వరకు ఉన్నాయి.

అవినీతి, మహిళల భద్రత విషయంలో గెహ్లాట్ ప్రభుత్వం పై మండిపడిన మోదీ (Modi fire)

రాజస్థాన్ లో అవినీతి, మహిళల భద్రత విషయంలో గెహ్లాట్ ప్రభుత్వం పై మాటల దాడి చేసిన ప్రధాని, దేశంలో ఎక్కడైనా కూతుళ్ల పై అఘాయిత్యాలు జరిగినప్పుడు తాను బాధపడ్డానని, అయితే ఇక్కడ కాంగ్రెస్ దీన్ని సంప్రదాయంగా మార్చిందని మోదీ ఆరోపించారు.

పేపర్ లీక్ మాఫియాను బాధ్యులను చేసి కఠినంగా శిక్షిస్తాం మోదీ

రాష్ట్రంలో పేపర్ లీక్ మాఫియాను బాధ్యులను చేసి కఠినంగా శిక్షిస్తాం. గత ఏడాది ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్యను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించారా అని మోదీ (Modi fire) ప్రశ్నించారు. మహిళల భద్రతతో పాటు రాష్ట్రంలో శ్రేయస్సు, ఉపాధి, అభివృద్ధిని బీజేపీ తీసుకువస్తుందని మోదీ అన్నారు.