Home   »  జాతీయం   »   పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు..?

పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు..?

schedule mahesh

హైద్రాబాద్: హైదరాబాద్ లో ఉన్నట్టుండి పెట్రోల్ బంకుల్లో వద్ద (petrol stations) వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్ బంకుల్లో రద్దీ పెరడం ఏంటని అనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే రేపటి నుండి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగబోతున్నారు.

motorists-lined-up-at-petrol-stations-?

పెట్రోల్ బంకుల(petrol stations) వద్ద బారులు తీరిన వాహనదారులు

హైద్రాబాద్: హైదరాబాద్ లో ఉన్నట్టుండి పెట్రోల్ బంకుల (petrol stations) వద్ద వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్ బంకుల్లో రద్దీ పెరడం ఏంటని అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే రేపటి నుండి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగబోతున్నారు.

అందువల్ల పలువురు వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు పెట్రోల్ బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులతో లారీ డ్రైవర్లు ధర్నాకు దిగారు.

సమ్మెకు దిగబోతున్న పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు

ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేయడం జరిగింది. మహారాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ప్రతి పెట్రోల్ బంకు దగ్గర వందలాది వాహనాలు క్యూ లో వున్నాయి. దీంతో చాలా బంకుల్లో పెట్రోల్, డీజిల్ అయిపోవడం జరిగింది. నో స్టాక్ బోర్డులు పెట్టారు.

కొత్త చట్టానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగిన లారీల యజమానులు

ముంబై, థానే, నాగ్‌పూర్, పుణె, నాసిక్‌తో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు 900 నుండి 1200 ట్యాంకర్లు ఆయిల్‌ డిపోల నుండి పెట్రోల్‌ బంకులకు ఇంధనాన్ని సరఫరా చేస్తుండేవి. కానీ ప్రస్తుతం 250 ట్యాంకర్లు మాత్రమే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో బంకుల్లో పెట్రోలు కొరత తీవ్రంగా వుంది. దీంతో కేంద్రం యజమానుల సంఘాలతో చర్చలు ప్రారభించినట్టు తెలుస్తుంది.

అత్యవసరం కింద చమురు ట్యాంకర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరిన కేంద్రం

అత్యవసరం కింద చమురు ట్యాంకర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. దీనిపై యాజమాన్యాలు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తుంది. హిట్ అండ్ రన్ కేసు విషయానికి వస్తే చట్టంలో మార్పులు వచ్చిన తర్వాత ఎవరైనా వ్యక్తిని లారీ ఢీకొట్టి కొట్టి వెళ్ళిపోతే ఆ కేసులో 10 లక్షల జరిమానా, గరిష్టంగా 7ఏళ్ల జైలు శిక్ష పడే విధంగా చట్టం తేవడం జరిగింది. రేపటి నుండి దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగితే పెట్రోల్, డీజిల్ కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం వుంది.

Also Read: దావూద్ ఇబ్రహీం ఇంటిని వేలం వేయనున్న ప్రభుత్వం..!