Home   »  జాతీయం   »   అల్లు అర్జున్‌కు మౌత్‌ ఆర్టిస్ట్‌ విషెస్‌

అల్లు అర్జున్‌కు మౌత్‌ ఆర్టిస్ట్‌ విషెస్‌

schedule ranjith

మొదటిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ అవార్డు రావడం అందరికి తెలిసిన విషయమే. ఐకాన్‌ స్టార్‌ అభిమానులు, నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌కు మౌత్‌ ఆర్టిస్ట్‌ స్వప్నిక విషెస్‌ తెలుపుతూ పుష్ప గెటప్‌ను నోటితో గీసిన విషయం తెలిసిందే. తాజాగా తనకు విషెస్‌ తెలిపిన స్వప్నిక ను అల్లు అర్జున్‌ అభినందించారు. చిత్రం ఎంతో అందంగా ఉందని, ఆయన ట్విటర్‌లో రిప్లై ఇచ్చారు. దీంతో కళాకారులను అభినందించడంతో బన్నీ ముందుంటారని ఫ్యాన్స్‌ ట్వీట్స్‌ చేస్తున్నారు.