Home   »  జాతీయం   »   8 మంది భారతీయులను విడుదల చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న నేవీ చీఫ్

8 మంది భారతీయులను విడుదల చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న నేవీ చీఫ్

schedule mahesh

న్యూఢిల్లీ: ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది భారతీయ సిబ్బందికి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ (Navy Chief) హరి కుమార్ సోమవారం వెల్లడించారు.

ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్న Navy Chief హరి కుమార్

గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న Navy Chief హరి కుమార్ మాట్లాడుతూ చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని, సిబ్బంది కుటుంబాలను అధైర్య పడవద్దని తెలిపారు.

బాధిత కుటుంబాలకు ఆదుకుంటామని హామీ ఇచ్చిన విదేశాంగ మంత్రి

దోహాలో నిర్బంధించబడిన ఎనిమిది మంది మాజీ నావికాదళ అధికారులకు మరణశిక్ష విధిస్తూ ఖతార్ కోర్ట్ తీర్పు ఇవ్వడం జరిగింది. అంతకుముందు రోజు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలతో సమావేశమయ్యారు మరియు వారి విడుదలకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని వారికి హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ కేసుకు ప్రభుత్వం “అత్యున్నత ప్రాముఖ్యత” ఇస్తుందన్న M.E.A

ఈ కేసుకు ప్రభుత్వం “అత్యున్నత ప్రాముఖ్యత” ఇస్తుందని మరియు ఆ విషయంలో కుటుంబాలతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (M.E.A)వెల్లడించింది. ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న 8 మంది భారతీయుల కుటుంబాలతో ఈ ఉదయం సమావేశమయ్యారు.

కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని నొక్కి చెప్పారు. బాధితుల విడుదలకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తుందని ఉద్ఘాటించారు. ఆ విషయంలో కుటుంబాలతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నామని విదేశాంగ శాఖా మంత్రి S. జైశంకర్ X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.