Home   »  జాతీయం   »   దేశవ్యాప్తంగా 30 చోట్ల NIA సోదాలు

దేశవ్యాప్తంగా 30 చోట్ల NIA సోదాలు

schedule ranjith
NIA searches NIA searches at 30 places across the country

NIA searches | దేశవ్యాప్తంగా నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) సోదాలు నిర్వహిస్తోంది. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, చండీగఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 30 చోట్ల NIA తనిఖీలు చేస్తోంది. ఉగ్రవాద కేసు విచారణలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల‌కు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేష‌న్‌లో పాల్గొన్నాయి. ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత నివాసాల్లో NIA అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రాల్లోని 30 చోట్ల NIA తనిఖీలు (NIA searches)

కాగా, జ‌న‌వ‌రి ఆరో తేదీన ఉగ్రవాదం, గ్యాంగ్ స్టర్, డ్రగ్ స్మగ్లింగ్ కు చెందిన భారీ కుట్రను NIA అధికారులు భగ్నం చేశారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు చెందిన నాలుగు ప్రాపర్టీలను అధికారులు సీజ్ చేశారు. 1967 నాటి UAPA చట్టిం కింద ఆ ఆస్తుల్ని NIA జప్తు చేసింది.

Also Read | రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో పలు చోట్ల NIA దాడులు..!