Home   »  జాతీయం   »   బీహార్ లో కోలువుదీరిన కొత్త ప్రభుత్వం.. 9వ సారి సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం

బీహార్ లో కోలువుదీరిన కొత్త ప్రభుత్వం.. 9వ సారి సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం

schedule mahesh

Nitish Kumar | బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించడం జరిగింది. నితీశ్ కుమార్ తో పాటు ఇద్దరు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

nitish-kumar-|-new-government-in-bihar

Nitish Kumar | బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. భారత కూటమికి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్ కాషాయ పార్టీతో జత కట్టారు. బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ 9వ సారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నితీశ్‌తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. నితీష్‌తో పాటు మరో 8 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జేడీయూ నుండి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హెచ్‌ఏఎం నుండి ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు మంత్రులుగా ప్రమాణం చేయడం జరిగింది.

ఇండియాను వీడి మళ్లీ NDAలో చేరిన Nitish Kumar

బీజేపీ నుండి సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు ఉపముఖ్యమంత్రులు పదవులు దక్కాయి. జేడీయూ నుండి విజయ్ చౌదరి, విజేంద్ర యాదవ్, శ్రవణ్ కుమార్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. HAM పార్టీ నుండి మంత్రిగా సంతోష్ సుమన్ ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ సింగ్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది.

డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు బీజేపీ నేతలు

2000 నుండి ఇప్పటివరకు 9వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తిగా నితీశ్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2000 సంవత్సరంలో వారం రోజులపాటు సీఎంగా పనిచేసిన నితీశ్ ఆ తర్వాత పొత్తులు మారుస్తూ వస్తున్నారు.

Also Read | కేంద్రంపై సంచలన ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్…!