Home   »  జాతీయం   »   Onion prices | సెంచరీకి చేరువవుతున్న ఉల్లి ధరలు.. ప్రస్తుతం kg రూ.80

Onion prices | సెంచరీకి చేరువవుతున్న ఉల్లి ధరలు.. ప్రస్తుతం kg రూ.80

schedule sirisha

న్యూఢిల్లీ: ఒకవైపు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుముఖం పడుతున్న సమయంలో, ఉల్లి ధరలు(Onion prices) ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలతో సహా దేశవ్యాప్తంగా ఉల్లిపాయ రిటైల్ ధరలు సగటున రూ. 80 గా పలుకుతుంది.

ఉల్లి సగటు ధర గణనీయంగా పెరిగినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ను ప్రకటించింది. ఉల్లి ధర రోజురోజుకు పెరుగుతూ గృహిణులను కంటతడి పెట్టిస్తుంది.

నిల్వలు తగ్గటంతో ఉల్లి ధరలు(Onion prices) పెరుగుతున్నాయి.

తగినంత ఉల్లి నిల్వలు లేకపోవడం, సరఫరా మందగించడంతో ఉల్లి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. డిసెంబర్‌లో కొత్త పంట మార్కెట్‌కు వచ్చే వరకు మరికొన్ని రోజులు ఉల్లి కొరత ఉంటుందని రైతులు, హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.

రెండు నెలల పాటు ఉల్లి ధరలు సగానికి సగం తగ్గే అవకాశం ఉందని అంచనా . ఉల్లి ధరలు స్థిరంగా ఉండేలా వినియోగదారుల వ్యవహారాల శాఖ ఉల్లి ఎగుమతులు మరియు ధరలను నిశితంగా పరిశీలిస్తోంది.

మరోవైపు ఉల్లికి పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల వ్యవహారాల శాఖ మండి విక్రయాల ద్వారా మార్కెట్‌లో మిగులు నిల్వలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

NAFED మరియు NCCF ఉల్లి ధరలను నియంత్రించేందుకు మరియు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉల్లి సేకరణ కసరత్తును కూడా నిర్వహిస్తున్నాయి.