Home   »  జాతీయం   »   జమ్మూ లో కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లు…కాల్పుల్లో గాయపడ్డ BSF సిబ్బంది

జమ్మూ లో కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లు…కాల్పుల్లో గాయపడ్డ BSF సిబ్బంది

schedule mahesh

జమ్మూ&కాశ్మిర్ : జమ్మూలోని సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు (IB)
వెంబడి గురువారం తెల్లవారుజామున పాక్ రేంజర్లు(Pak Rangers firing) అకారణంగా జరిపిన కాల్పుల్లో BSF జవాన్ గాయపడ్డారని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

24 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం మూడోసారి

జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు 24 రోజుల వ్యవధిలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, సరిహద్దు ఔట్‌ పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం ఇది మూడోసారి. ఈ కాల్పులలో ఒక BSF జవాను గాయపడ్డాడు. గాయపడిన సిబ్బందిని జమ్మూలోని జిఎంసి ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు.

నవంబర్ 8 2023 రాత్రి రామ్‌గఢ్ ప్రాంతంలో Pak Rangers firing

నవంబర్ 8/9 2023 రాత్రి మధ్యలో, రామ్‌గఢ్ ప్రాంతంలో పాక్ రేంజర్లు ఒక్కసారి గా కాల్పులకు తెగబడ్డారు. దీనికి BSF దళాలు తగిన విధంగా ప్రతిస్పందించాయని BSF ఒక ప్రకటనలో తెలిపింది.

గురువారం తెల్లవారుజామున 12.20 గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభమై, ఆ తర్వాత పెద్ద ఎత్తున కాల్పులకు దారితీసిందని జెర్డా గ్రామస్థుడు మోహన్ సింగ్ భట్టి తెలిపారు. అక్టోబర్ 28న పాకిస్తాన్ రేంజర్లు సుమారు ఏడు గంటల పాటు భారీ కాల్పులు మరియు షెల్లింగ్‌లతో దాడులకు తెగబడ్డారు.

ఫలితంగా ఇద్దరు BSF జవాన్లు మరియు ఒక మహిళ గాయపడ్డారు. అక్టోబర్ 17న అర్నియా సెక్టార్‌లో పాకిస్థాన్ రేంజర్లు అనూహ్యంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు BSF సిబ్బంది గాయపడ్డారు.