Home   »  జాతీయం   »   నేటి నుండే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..

నేటి నుండే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..

schedule mahesh

Parliament | పార్లమెంట్‌లో మోదీ సర్కార్ చివరి బడ్జెట్ సమావేశాలు బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది.

parliament-budget-meetings-from-today

Parliament | పార్లమెంట్‌లో మోదీ గవర్నమెంట్ చివరి బడ్జెట్ సమావేశాలు బుధవారం నుండి మొదలుకానున్నాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా సమావేశాలు సజావుగా కొనసాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.

ఫిబ్రవరి 9తో ముగియనున్న Parliament సమావేశాలు

లోక్‌సభ ఎన్నికల అనంతరం అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు జరుగనున్నాయి. మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.

రేపు తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

అఖిలపక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను కూడా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెడతారన్నారు. ఈ సమావేశాల ఎజెండాలో రాష్ట్రపతి ప్రసంగం, మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదన, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, చర్చకు ప్రధాని మోదీ సమాధానాలుంటాయని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు పలు అంశాలను ప్రస్తావించారు. నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం, వ్యవసాయంలో సంక్షోభం, మణిపూర్‌లో హింస వంటి అంశాలను పార్లమెంట్ లో లేవనెత్తుతామని తెలిపారు. ప్రార్థనాస్థలాలపై చట్టాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సమాజ్ వాదీ పార్టీ నేత ఎస్టీ హసన్ డిమాండ్ చేయడం జరిగింది.

Also Read | Budget Session 2024 | పార్లమెంట్‌లో ప్రతిపక్ష MPల సస్పెన్షన్‌ రద్దు.!