Home   »  జాతీయం   »   PG, Ph.D. లు చేసి కూరగాయలు అమ్ముకుంటున్న Dr. సందీప్

PG, Ph.D. లు చేసి కూరగాయలు అమ్ముకుంటున్న Dr. సందీప్

schedule sirisha

PhD Man Sells Vegetable | ఓ వ్యక్తి 4 సబ్జెక్టుల్లో PG చేసి ఆపై Ph.D కూడా పూర్తి చేశాడు. డాక్టరేట్ కూడా అందుకున్న అతను యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చదువు చెప్పాడు. అయితే అవన్నీ వదిలేసి ప్రస్తుతం కూరగాయలు అమ్ముకుంటున్నాడు.

PhD Man Sells Vegetable | Coming together in time PG, Ph.D. Selling vegetables with Dr. Sandeep

PhD Man Sells Vegetable | కూరగాయలు అమ్ముకుంటున్న Dr. సందీప్

PhD Man Sells Vegetable | డా. సందీప్ సింగ్ ఒక PhD మరియు 4 PG డిగ్రీలను అందుకున్నాడు. ఒకప్పుడు కాంట్రాక్ట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు. బాగా చదివి డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చదివినా, ప్రస్తుతం చెక్క బండిపై ఇంటింటికీ కూరగాయలు అమ్ముతున్నాడు. తాజాగా పంజాబ్‌కు చెందిన 39 ఏళ్ల సందీప్ సింగ్ కూరగాయలు అమ్ముతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. PhD సబ్జీవాలా అనే బోర్డును కూడా పెట్టుకుని బండిని విధుల్లో తిప్పుతూ కూరగాయలను అమ్ముకుంటున్నాడు.

పేరు చివర 4 PG, Ph.D లు ఉన్న సందీప్

పేరు చివర పీజీ, పీహెచ్‌డీ, ఎన్నో డిగ్రీలు ఉన్నప్పటికీ ఉన్నత చదువులు చదివి ఇప్పుడు వీధుల్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించాల్సి వస్తోంది. సరైన ఉద్యోగం దొరక్కపోవడంతో కాంట్రాక్ట్ ప్రొఫెసర్ కంటే ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్మడం ద్వారా ఎక్కువ సంపాదించవచ్చని డాక్టర్ సందీప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

డాక్టర్ సందీప్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలోని లా డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌గా 11 సంవత్సరాలు పనిచేశారు. ఓ వైపు పనిచేస్తూనే పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టుల్లో పీజీ చదివాడు. అయితే కాంట్రాక్టు ప్రొఫెసర్‌గా కుటుంబాన్ని పోషించుకోలేక, సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో, చాలీచాలని జీతంతో చాలా ఇబ్బందులు పడ్డాడు.

తక్కువ జీతంతో బ్రతకలేకపోయా: సందీప్ సింగ్

కొద్దిపాటి జీతంతో సందీప్ కుటుంబాన్ని పోషించేందుకు నానా కష్టాలు పడేవాడు. దాంతో ఆ ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగం వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. జీతం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో పంజాబ్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేశానని డాక్టర్ సందీప్ సింగ్ తెలిపారు.

ఉద్యోగం మానేసిన తర్వాత, సందీప్ సింగ్ తన కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. అయితే తాను ప్రస్తుతం కూరగాయల విక్రయాలు ప్రారంభించినట్లు తెలిపారు. కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతున్నానని అయినా తనకు బోధనపై ఉన్న ప్రేమ, మక్కువ తగ్గలేదని సందీప్ సింగ్ అన్నాడు.

గతంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన దానికంటే ఇప్పుడు కూరగాయలు అమ్ముతూ ఎక్కువ సంపాదిస్తున్నానని అన్నారు. కానీ దాన్నుంచి కొంత డబ్బు ఆదా చేసి ఏదో ఒకరోజు ట్యూషన్ సెంటర్ తెరవాలనే తన కోరికను డాక్టర్ సందీప్ సింగ్ వ్యక్తం చేశాడు.

Also read: బెంగళూరు మెట్రో ట్రాక్‌పై పడిపోయిన ఫోన్‌ కోసం దూకిన మహిళ