Home   »  జాతీయం   »   ఛత్తీస్‌గఢ్‌లో IIT భిలాయ్ ని ప్రారంభించిన ప్రధాని..!

ఛత్తీస్‌గఢ్‌లో IIT భిలాయ్ ని ప్రారంభించిన ప్రధాని..!

schedule mahesh

ఛత్తీస్‌గఢ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భిలాయ్ (IIT Bhilai)ని మరియు కొత్తగా నిర్మించిన రెండు కేంద్రీయ విద్యాలయ భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.

pm-inaugurated-iit-bhilai-in-chhattisgarh

IIT Bhilai | ప్రస్తుతం IIT Bhilaiలో 1,250 మంది విద్యార్థులు ఉన్నారు మరియు రాబోయే మూడు-నాలుగేళ్లలో దాదాపు 2,500 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా దాని సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ సంస్థను మరియు రెండు కేంద్రీయ విద్యాలయాలను దేశానికి అంకితం చేసారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఛత్తీస్‌గఢ్ CM

భిలాయ్‌లోని IIT క్యాంపస్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, దుర్గ్ MP విజయ్ బాఘెల్, IIT భిలాయ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ K వెంకట్రామన్, ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజీవ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

జూన్ 14, 2018న IIT భిలాయ్ క్యాంపస్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన

ప్రధాని మోదీ జూన్ 14, 2018న IIT భిలాయ్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం జూలై 2020లో ప్రారంభమైందని ఇక్కడి ప్రజా సంబంధాల విభాగం అధికారి తెలిపారు. IIT భిలాయ్ క్యాంపస్ 400 ఎకరాల్లో విస్తరించి ఉందని, దీని నిర్మాణానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ రూ.1,090 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని చెప్పారు. కవార్ధా (కబీర్‌ధామ్ జిల్లా) మరియు కురుద్ (ధమ్‌తరి జిల్లా)లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాలను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

Also Read | “ఆర్టికల్ 370” సినిమాపై ప్రశంసలు కురిపించిన ప్రధాని..!