Home   »  జాతీయం   »   political | ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యల పై ప్రధాని స్పందన..

political | ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యల పై ప్రధాని స్పందన..

schedule mahesh

న్యూఢిల్లీ : తమిళనాడు political CM ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన

నేపథ్యంలో దీని పై అధికార BJP political తోపాటు హిందూ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ తల నరికి తీసుకువస్తే 10 కోట్లు ఇస్తానని ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య స్వామీజీ ఆఫర్ చేశారు.

తన తల నరికి తెస్తే రూ.10 కోట్లు ఇస్తామని ప్రకటించిన స్వామీజీ పై ఉదయనిధి స్టాలిన్‌ మండిపడ్డారు. నా తల కోసం ఎవరు వస్తారో చూస్తాను.

గతంలోనూ కరుణానిధి పై కోటి ప్రకటించారు. నేను ఎవరికీ భయపడను. నా తల కోసం 10 కోట్లు అవసరం లేదు.

దువ్వుకోవడానికి పది రూపాయల దువ్వెన సరిపోతుంది. నా కోసం అంత మొత్తం వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇలాంటి బెదిరింపులు మాకు కొత్తేమి కాదు.

తమిళనాడు ప్రజల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి కరుణానిధి మనవడిని నేను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

అయితే ఈ వ్యవహారం పై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.

అయితే ఇది బహిరంగంగా కాకుండా మంత్రుల సమావేశంలో మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటికే స్టాలిన్ వ్యాఖ్యల పై కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.

సనాతన ధర్మం పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్‌ రంగరాజన్‌ తీవ్రంగా ఖండించారు.

సనాతన ధర్మం అంటే వేదమే ఆధారమైనటువంటి ధర్మం దానికి వ్యతిరేకంగా మాట్లాడారంటే శ్రీరాముడు, కృష్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే రాజ్యాంగ పదవిలో ఉండి ఇలా మాట్లాడటాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకోవాలి.

ధర్మాన్ని నమ్మేవాళ్లనే ఎన్నుకోవాలని తమిళనాడు భక్తులకు చెప్తామని ఆయన పేర్కొన్నారు.