Home   »  జాతీయం   »   Prewedding shoot | ఆపరేషన్‌ థియేటర్‌లో ప్రీవెడ్డింగ్‌ షూట్‌.. వైద్యుడి సస్పెండ్‌

Prewedding shoot | ఆపరేషన్‌ థియేటర్‌లో ప్రీవెడ్డింగ్‌ షూట్‌.. వైద్యుడి సస్పెండ్‌

schedule ranjith

కర్ణాటక | ఓ యువ వైద్యుడు తన ప్రీవెడ్డింగ్ షూట్‌ను ఏకంగా ఆపరేషన్ గదిలో షూట్ చేయించుకున్నాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాకెక్కి వైరల్‌గా మారడంతో ప్రభుత్వం అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసింది.

Prewedding shoot Prewedding shoot in operation theatre.. Doctor suspended

Prewedding shoot | ఓ యువ డాక్టర్‌ తనకు కాబోయే భార్యతో ఆసుపత్రిలో ప్రీవెడ్డింగ్‌ షూట్‌ (Prewedding shoot) నిర్వహించి సస్పెండ్‌ అయ్యారు. కర్ణాటకలోని చిత్రదుర్ల జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డా.అభిషేక్‌ తనకు కాబోయే భార్యతో కలిసి ఓ వ్యక్తికి ఆపరేషన్‌ చేస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవడంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్‌ తీవ్రంగా స్పందిస్తూ… ఆసుపత్రులు ఉన్నది ప్రజలకు వైద్యం అందించేందుకే కానీ ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. సామాన్యుల కోసమే ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పిస్తోందని, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు విధి నిర్వహణపై దృష్టిసారించాలని సూచించారు. వైద్యుడిని విధుల నుంచి తొలగించారు.

Also read | పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన కింద 8మంది అధికారుల సస్పెండ్‌..!