Home   »  జాతీయం   »   గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ..!

గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ..!

schedule mahesh

అహ్మదాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన ట్విట్టర్ (X) ఖాతాలో పేర్కొన్నారు.

prime-minister-modi-is-visiting-gujarat-!

గుజరాత్ లో పర్యటిస్తున్న Prime Minister Modi

అహ్మదాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం రాత్రి అహ్మదాబాద్ లో అడుగుపెట్టారు.అహ్మదాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి (Prime Minister Modi) ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు C.R పాటిల్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ విమానాశ్రయం నుండి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. మోదీ తన రెండు రోజుల అహ్మదాబాద్ పర్యటనలో వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ మరియు ఇతర కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

గాంధీనగర్‌లోని మహాత్మా మందిరానికి వెళ్లనున్న ప్రధాని మోదీ

ట్విట్టర్ వేదికగా PM మోదీ తెలిపిన వివరాల ప్రకారం… “ఈ శిఖరాగ్ర సదస్సులో పలువురు ప్రపంచ అగ్రశ్రేణి నేతలు పాల్గొనడం సంతోషంగా ఉందని, తన సోదరుడు మహమ్మద్ బిన్ జాయెద్ రాక ప్రత్యేకమైనదని X లో ప్రధాని వెల్లడించారు. ఈ వేదిక గుజరాత్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 9:30 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిరానికి వెళ్లనున్నారు.”

ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్న మోదీ

వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లో వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. తన ఎజెండాలో భాగంగా ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రముఖ కార్పొరేషన్ల CEOలతో ఏర్పాటు చేసిన సెషన్‌లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోను ప్రారంభించనున్నారు. జనవరి 10వ తేదీ ఉదయం 9:45 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024ను ప్రధాని ప్రారంభిస్తారు.

ఆ తర్వాత గ్లోబల్‌ కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం కానున్నారు. అనంతరం మోదీ జీ.ఐ.ఎఫ్‌.టీ(గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ)(GIFT) సిటీకి వెళ్లనున్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్‌షిప్ ఫోరమ్‌లోని ప్రముఖ వ్యాపార నాయకులతో సాయంత్రం 5:15 గంటలకు సమావేశం కానున్నారు.

Also Read: దేశంలో 682కు చేరిన JN.1 వేరియంట్‌ కేసులు