Home   »  జాతీయం   »   విపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ..!

విపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ..!

schedule mahesh

Prime Minister Modi: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన నేపథ్యంలో విపక్ష పార్టీలు తీవ్ర నిరాశకు లోనయ్యాయి. ఆ నిరాశతోనే పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష M.Pలు గందరగోళం సృష్టిస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు.

Prime Minister Modi

విపక్షాలపై విరుచుకుపడ్డ Prime Minister Modi

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పార్లమెంట్‌లో విపక్షాల తీరు వల్ల 2024 సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల్లో వారి సంఖ్య మరింత తగ్గుతుందన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఎంపీల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనలను సమర్థించే ప్రయత్నాలపై ప్రధాని మోదీ మండిపడ్డారు.

పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రధాని మోదీ మొదటిసారి స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మి, ప్రజాస్వామిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు ఈ ఘటనను ఖండించాలన్నారు. ప్రజాస్వామ్య విలువలను నమ్మే పార్టీ ఈ ఘటనను బహిరంగంగానో, రహస్యంగానో ఎలా సమర్ధించగలదన్నారు.

పార్లమెంట్‌లో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన 141 మంది MPలు

పార్లమెంట్‌లో శాంతిభద్రతల వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి సభలో ప్రకటన చేయాలని పట్టుబడుతున్నాయి. ఈ మేరకు సభ సమావేశాలు వరుస వాయిదా పడుతున్నాయి. దీంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగట్లేదు. ఈ క్రమంలో ప్రతిపక్ష M.Pలను స్పీకర్ సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 141 మందిని సస్పెండ్ చేశారు.

Also Read: శబరిమలలో అయ్యప్ప భక్తులపై లాఠీఛార్జ్..!