Home   »  జాతీయం   »   మరో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

మరో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

schedule mahesh

వారణాసి: తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఇందులో భాగంగా వారణాసి నుండి ఢిల్లీకి మరో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్-04015)ను సోమవారం ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

Prime Minister Modi

వందే భారత్ రైలును ప్రారంభించిన Prime Minister Modi

వారణాసి-ఢిల్లీ మార్గంలో ఇప్పటికే ఒక రైలు నడుస్తోంది, ఇది రెండోది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులు పాల్గొనటం జరిగింది. ఈ రైలును అధునాతన ఫీచర్లతో రూపొందించినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

తాజా వందే భారత్ రైలుతో దేశంలో 35కి చేరిన వందే భారత్ రైళ్లు

ఈ రైలులో Wifi-సేవలు, G.P.S ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, టచ్ ఫ్రీ ఫెసిలిటీస్‌తో కూడిన బయో-వాక్యూమ్ టాయిలెట్లు, డిఫ్యూజ్ ఎల్‌ఈడీ లైటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తాజా వందే భారత్ రైలుతో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య 35కి చేరుకుంది.

ఇదిలా ఉండగా ఇటీవల ప్రధాని ప్రారంభించిన వందేభారత్ రైలు వారణాసిలో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి రాత్రి 11.05 గంటలకు వారణాసి చేరుకోనుంది.

Also Read: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరంను ప్రారంభించిన మోదీ