Home   »  జాతీయం   »   2023 గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ప్రధాని మోడీ మిల్లెట్స్ పాట

2023 గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ప్రధాని మోడీ మిల్లెట్స్ పాట

schedule mahesh

న్యూఢిల్లీ: మిల్లెట్ల ప్రయోజనాలను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Modi)భారతీయ అమెరికన్ గాయని ఫాల్గుణి షా తో కలిసి చేసిన ప్రత్యేక గీతం ఉత్తమ ప్రపంచ సంగీత ప్రదర్శన విభాగంలో గ్రామీ అవార్డుకు ఎంపికైనట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

Prime Minister Modi,ఫాల్గుణి షా,గౌరవ్ షాలు కలిసి రాసిన పాట “అబండెన్స్ ఇన్ మిల్లెట్స్

తృణ ధాన్యాల ప్రాధాన్యత, లాభాలను తెలియచేస్తూ, ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోడీ ఒక పాటను విడుదల చేయడం జరిగింది. ప్రముఖ ఇండో అమెరికన్ గాయని ఫాల్గుణి షాతో కలిసి ఈ పాటను రాయడమే కాకుండా ప్రధాని గొంతును కూడా అందిచడం జరిగింది.

తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిపే పాట

ప్రధాని(Prime Minister Modi) అబాండెన్స్ ఇన్ మిల్లెట్స్ పేరుతో హిందీతో పాటు,ఇంగ్లీషు భాషల్లోనూ ఈ పాట విడుదల కావటం జరిగింది. పాటలో భాగంగా ప్రధాని మోడీ స్వయంగా పలికిన మాటలు ఈ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరిగింది. తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు,వాటి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్యలను ఎలా నిర్ములించాలన్నది ఈ పాట రూపంలో తెలియచేసారు.

గ్రామీ పురస్కారానికి నామినేట్ అయిన “అబండెన్స్ ఇన్ మిల్లెట్స్” పాట

ప్రధాని మోడీ, ఫాల్గుణి దంపతులు రాసిన, పాడిన పాట తాజాగా “అబండెన్స్ ఇన్ మిల్లెట్స్” ప్రతిష్ఠాత్మక గ్రామీ పురస్కారానికి ఎంపికైంది. కాగా 2022లోనే ఫాల్గూణి షాకు గ్రామీ అవార్డు లభించింది. ఈ సందర్భంగానే ఫాల్గుణి షా, ఆమె భర్త గౌరవ్ షా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీని కలవడం జరిగింది. ఈ సమయంలోనే “అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’” పాటకు పునాది పడింది.

మనుషుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి సంగీతానికి బలమైన శక్తి ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆకలి నిర్మూలన సమస్య కోసం ఒక పాట రాయాలని ప్రధాని మోడీ ఫాల్గుణి దంపతులకు సూచించారట.అప్పుడే తృణ ధాన్యాలపై ప్రత్యేక గీతాన్ని రూపొందించాలని ఫాల్గుణి షా నిర్ణయం తీసుకున్నారట. కాగా ఐక్యరాజ్య సమితి 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక గీతం ఉత్తమ ప్రపంచ సంగీత ప్రదర్శన విభాగంలో గ్రామీ అవార్డుకు ఎంపికైనట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.