Home   »  జాతీయం   »   నేటితో ముగియనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు

నేటితో ముగియనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు

schedule mahesh

RajyaSabha election nomination | రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ గడువు నేటితో ముగియనుంది. దేశంలోని 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఈనెల 27న పోలింగ్‌ జరగనుండగా, అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.

rajyasabha-election-nomination-deadline-is-today

RajyaSabha election nomination | రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ గడువు నేటితో ముగియనుంది. దేశంలోని 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఈనెల 27న పోలింగ్‌ జరగనుండగా, అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. చాలా రాష్ట్రాల్లో సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, BRS అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేర్లు ఖరారైన సంగతి తెలిసిందే.

ఇక ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి సుముఖత చూపడం లేదన్న వార్తతో YCP నుంచి నామినేషన్లు వేసిన మేడా శివనాధ్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. నేడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు.

Also Read | నేడు రైతు సంఘాల నేతలతో కేంద్రమంత్రుల చర్చలు..!