Home   »  జాతీయం   »   బెంగాల్‌ను కుదిపేస్తున్న రేషన్ కుంభకోణం కేసు.. మరో TMC నేత అరెస్ట్‌

బెంగాల్‌ను కుదిపేస్తున్న రేషన్ కుంభకోణం కేసు.. మరో TMC నేత అరెస్ట్‌

schedule mahesh

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రేషన్ పంపిణీ కుంభకోణం (Ration scam case) కేసు అధికార TMC పార్టీ నేతలను కుదిపేస్తోంది. PDS స్కాంలో ఇప్పటికే కొందరు అధికార టీఎంసీ పార్టీ నేతలను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా మరో నేతను అరెస్ట్ చేసింది.

ration-scam-case-shaking-bengal

బెంగాల్‌ను కుదిపేస్తున్న Ration scam case కేసు

విస్తృత సోదాల తర్వాత అధికారులు బంగావ్ మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ శంకర్ ఆధ్యాను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణకు సహకరించినప్పటికీ తన భర్తను అరెస్ట్ చేశారని శంకర్ భార్య జ్యోత్స్న వెల్లడించారు. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి శంకర్ అధ్యాతో పాటు మరో TMC నేత సహజన్ షేక్ ఇంట్లో ED సోదాలు నిర్వహించింది.

30 శాతం రేషన్‌ సరుకులు మార్కెట్‌లో అమ్ముకున్న నేతలు

బెంగాల్‌లో ప్రజలకు అందాల్సిన రేషన్‌ సరుకుల్లో నిందితులు దాదాపు 30 శాతం బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్నారని ED తెలిపింది. కాగా సోదాలు జరుగుతున్న సమయంలో సహజన్ షేక్ బంధువులు, మద్దతుదారులు ఈడీ అధికారులపై దాడికి పాల్పడ్డారు. దాదాపు 800-1000 మంది మూక దాడికి వచ్చారని, అధికారులు, భద్రతా సిబ్బందిని ఘెరావ్‌ చేశారని ఈడీ తెలిపింది. ఈ దాడిలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పర్సులు దోచుకెళ్లారని, పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. గాయపడిన అధికారులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Also Read: తొలి T20లో టీమిండియా ఘన విజయం