Home   »  జాతీయం   »   మార్చి నెలలో రూ.1.78లక్షల కోట్ల GST..!

మార్చి నెలలో రూ.1.78లక్షల కోట్ల GST..!

schedule raju
Record GST collections in March 2024

Record GST collections | ఒకే దేశం ఒకే పన్ను విధానంతో తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తోంది. మార్చి నెలలో రూ.1.78 లక్షల కోట్ల GST వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.5 శాతం ఎక్కువ. గరిష్ఠంగా ఫిబ్రవరిలో 12.5 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన GSTలో వృద్ధి (17.6%) నమోదు కావడం వల్ల కలెక్షన్లు పెరిగాయని కేంద్రం తెలిపింది. FY24లో GST కలెక్షన్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11.7% పెరిగి రూ.20.14 లక్షల కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.

2024 ఆర్థిక సంవత్సరం సగటు నెలవారీ స్థూల సేకరణ (Record GST collections) రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్లకుపైనే వసూళ్లు జరిగాయి. ఏడాది పొడవునా రీఫండ్స్ మినహా నెట్ GST రెవెన్యూ 13.4 శాతం పెరిగి రూ.18.01 లక్షల కోట్లకు పెరిగింది.

గత నెలలో సెంట్రల్ GST (CGST) వసూళ్లు రూ.34,532 కోట్లు, స్టేట్ GST (SGST) వసూళ్లు రూ.43,746 కోట్లు, రూ.40,322 కోట్ల వివిధ వస్తువుల దిగుమతి సుంకంతోపాటు ఇంటిగ్రేటెడ్ GST (IGST) రూ.87,947 కోట్లకు చేరుకుంది. దిగుమతి వస్తువులపై రూ.996 కోట్లతోపాటు అమ్మకపు వసూళ్లు రూ.12,259 కోట్లు అని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.

Also Read: 2023 అక్టోబర్‌లో GST రూ. 1.72 లక్షల కోట్లు వసూళ్లు…