Home   »  జాతీయం   »   బీహార్ లో 65 శాతానికి చేరిన రిజర్వేషన్లు… అసెంబ్లీలో బిల్లు ఆమోదం

బీహార్ లో 65 శాతానికి చేరిన రిజర్వేషన్లు… అసెంబ్లీలో బిల్లు ఆమోదం

schedule mahesh

పాట్నా : సార్వత్రిక ఎన్నికల వేళ బీహార్ లో కుల రాజకీయాలు పతాక స్ధాయికి చేరుకున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇండియా కూటమి పార్టీలు అధికారంలో వున్న బీహార్ లో కులాల సర్వే చేపట్టిన నితీశ్ సర్కార్ ఇప్పుడు మరో కీలక ముందడుగు వేయడం జరిగింది.

Reservations బిల్లును ఏక గ్రీవంగా అమోందించిన బీహార్ అసెంబ్లీ

రాష్ట్రంలో కులాల సర్వేలో బయటబడిన గణాంకాల ఆధారంగా రిజర్వేషన్ల పరిమితిని పెంచుతూ నితీశ్ కుమార్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో బీహార్ లో రిజర్వేషన్లు (Reservations) 65 శాతానికి చేరడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచే బిల్లుకు బీహార్ అసెంబ్లీ లో ఇవాళ ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.

సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని మించిపోయిన రిజర్వేషన్లు

దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు (Reservations) సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని మించి పోయాయి. సవరించిన బిల్లు చట్టరూపం దాల్చడానికి ముందు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆమోదం మాత్రమే మిగిలి వుంది. మహిళల విద్య, జనాభా నియంత్రణపై సీఎం నితీష్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఇవాళ అసెంబ్లీలో గందరగోళం చెలరేగగా, అయితే ఈ గందరగోళం మధ్యే రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేయడం జరిగింది.

వెనుకబడిన తరగతుల మహిళలకు ఉన్న మూడు శాతం రిజర్వేషన్లు తొలగింపు

సవరించిన కోటాల ప్రకారం ఎస్సీ అభ్యర్థులకు 20 శాతం, ఓబీసీలకు 18, ఈబీసీలకు 25 శాతం రిజర్వేషన్ లభించడం జరిగింది. ఎస్టీలకు రెండు శాతానికి రిజర్వేషన్ల పెంచారు. ప్రస్తుతం ఈబీసీలకు 18 శాతం, వెనుకబడిన తరగతులకు 12 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 16 శాతం, షెడ్యూల్డ్ తెగలకు ఒక శాతం రిజర్వేషన్లు వున్నాయి. వెనుకబడిన తరగతుల మహిళలకు ప్రస్తుతం ఉన్న మూడు శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయడం జరిగింది.

బీహార్ అసెంబ్లీలో సవరించిన బిల్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి 10 శాతం రిజర్వేషన్‌ను మినహాయించింది. అలాగే మొత్తం కోటాలను 75 శాతానికి తీసుకెళ్లనుంది. బీహార్‌లోని 13.1 కోట్ల మందిలో 36 శాతం మంది ఈబీసీలకు చెందిన వారు, 27.1 శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందిన వారని గతంలో కులాల సర్వే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ఇప్పుడు రిజర్వేషన్లను పెంచడం జరిగింది.