Home   »  జాతీయం   »   ED దాడులను ఖండించిన సచిన్‌ పైలట్‌, మల్లికార్జున్ ఖర్గే

ED దాడులను ఖండించిన సచిన్‌ పైలట్‌, మల్లికార్జున్ ఖర్గే

schedule mahesh

జైపూర్‌: రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ దొస్రా నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) దాడులు నిర్వహించడాన్ని కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) ఖండించారు. బీజేపీ “ఓటమి భయం” స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

బీజేపీ ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందన్న Sachin Pilot

ట్విట్టర్ ‘X’లో పైలట్ ఇలా తెలిపాడు. రాజస్థాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ పై ED దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాన్నరు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు కూడా ఈడీ సమన్లు ​​జారీ చేయటం జరిగింది. ఇలాంటి వ్యూహాలతో బీజేపీ కాంగ్రెస్ నేతలను భయపెట్టలేదు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సంఘీభావం తెలుపుతున్నారు.

గోవింద్ సింగ్ పై ED దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా: పైలట్‌

రాబోయే ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నందున ఇటువంటి చర్యలతో బిజెపి భయాందోళన గురిచేయటం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన తెలిపారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని సివిల్‌లైన్స్‌లోని గోవింద్ సింగ్ అధికారిక నివాసంలో ED సోదాలు జరిపారు.

రాజస్థాన్‌లోని దాదాపు డజను చోట్ల జరుగుతున్న ED సోదాలు

పేపర్ లీక్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాజస్థాన్‌లోని దాదాపు డజను చోట్ల సోదాలు నిర్వహస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పేపర్ లీకేజీ కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు, కాంగ్రెస్ నేత వైభవ్ గెహ్లాట్‌కు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ ED సమన్లు ​​జారీ చేసింది.

E.D , C.B.I , I.T లు బిజెపికి నిజమైన “పన్నా ప్రముఖ్”లుగా మారాయి: ఖర్గే

అంతకుముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం భారతీయ జనతా పార్టీ (B.J.P)పై మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్నందున, E.D, C.B.I మరియు I.T బిజెపికి నిజమైన “పన్నా ప్రముఖ్”లుగా మారాయని తెలిపారు. రాజస్థాన్‌లో ఓటమి ఖాయమని భావించిన భారతీయ జనతా పార్టీ తన చివరి ఎత్తుగడ వేసిందని ఖర్గే మండిపడ్డారు.