Home   »  జాతీయం   »   Samudrayaan | సముద్రయాన్‌ మిషన్‌.. సముద్రంలో 6000 మీటర్ల లోతుకి ముగ్గురు అక్వానాట్స్‌

Samudrayaan | సముద్రయాన్‌ మిషన్‌.. సముద్రంలో 6000 మీటర్ల లోతుకి ముగ్గురు అక్వానాట్స్‌

schedule raju

Samudrayaan Mission | చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతం కావడంతో భారత శాస్త్రవేత్తలు మరో ప్రతిష్టాత్మక మిషన్‌కు సిద్దమవుతున్నారు. ఈసారి సముద్రయాన్ (Samudrayaan) పేరుతో సముద్రం అడుగున 6 వేల మీటర్ల లోతుకు మనుషులను పంపనున్నారు.

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన జలాంతర్గామి ‘మత్స్య’ (Matsya) ద్వారా సముద్ర అడుగు భాగంలోకి వెళ్లి.. కోబాల్డ్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలు, ఖనిజాల గురించి అన్వేషించనున్నారు.

వచ్చే ఏడాది తొలినాళ్లలో చెన్నై తీరంలో బంగళాఖాతంలోకి ముగ్గురు ఆక్వానాట్స్‌ను మత్స్య ద్వారా పంపేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: Chandrayan: చంద్రయాన్‌-3ని ఫొటో తీసిన చంద్రయాన్‌-2

6,000 మీటర్ల లోతులో 600 బార్ పీడనాన్ని (సముద్ర మట్టం వద్ద పీడనం కంటే 600 రెట్లు ఎక్కువ) తట్టుకునేలా 80 మిల్లీమీటర్ల మందపాటి టైటానియం మిశ్రమంతో గోళాన్ని తయారు చేశారు.

సముద్ర అంతర్భాగంలో 12 నుంచి 16 గంటల పాటు పనిచేసేలా దీనిని రూపొందించామని, అయితే ఆక్సిజన్ సరఫరా 96 గంటల పాటు అందుబాటులో ఉంటుంది’ అని తెలిపారు.

Also Read: చంద్రయాన్‌-3 సక్సెస్‌.. ఇస్రో చేతికి NASA ఉపగ్రహం

సముద్రయాన్‌ (Samudrayaan) మిషన్‌ లక్ష్యం

ఈ ప్రాజెక్ట్ పెద్ద డీప్ ఓషన్ మిషన్‌లో భాగం, ఇది కేంద్రం యొక్క బ్లూ ఎకానమీ విధానానికి మద్దతు ఇస్తుంది.

ఈ విధానం దేశ ఆర్థిక వృద్ధికి, మెరుగైన జీవనోపాధికి, ఉద్యోగ కల్పనకు, సముద్ర పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సముద్ర వనరులను నిలకడగా ఉపయోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.

సముద్ర అడుగున పరిశోధన మిషన్‌లో భాగంగా సముద్రయాన్ చేపట్టాం… మేము 2024 మొదటి త్రైమాసికంలో 500 మీటర్ల లోతులో సముద్ర ట్రయల్స్ నిర్వహిస్తాం’ అని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ చెప్పారు.

ఈ మిషన్ 2026 నాటికి పూర్తిగా సాకారం అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే మానవసహిత సబ్‌‌లను అభివృద్ధి చేశాయి.