Home   »  జాతీయం   »   అండమాన్ నికోబార్ దీవుల్లో తీవ్ర భూకంపం.!

అండమాన్ నికోబార్ దీవుల్లో తీవ్ర భూకంపం.!

schedule raju

Andaman and Nicobar | అండమాన్ మరియు నికోబార్ దీవులలో తీవ్ర భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) సోమవారం తెలిపింది. అంతకుముందు జనవరి 10న అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది.

Severe earthquake in Andaman and Nicobar Islands

Andaman and Nicobar | అండమాన్ మరియు నికోబార్ దీవులలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) సోమవారం తెలిపింది. భారత కాలమానం ప్రకారం (IST) 7:06:19 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. NCS ప్రకారం.. భూకంప కేంద్రం 11 కి.మీ లోతులో అక్షాంశం 9.97 మరియు రేఖాంశం 93.54 వద్ద నమోదైంది.

అంతకుముందు జనవరి 10న అండమాన్ దీవుల్లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. NCS ప్రకారం.. ఉదయం 7.53 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. NCS డేటా ప్రకారం.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో అక్షాంశం 12.66 మరియు రేఖాంశం 93.02 వద్ద ఉన్నట్లు కనుగొనబడింది.

Also Read: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన భారీ భూకంపం