Home   »  జాతీయం   »   ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయం…!

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయం…!

schedule mahesh

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)బుధవారం బిజెపి పై మండిపడ్డారు. బీజేపీ పార్టీ మునుపటిలాగా నిధులు సమీకరించలేకపోయింది. అంతేకాకుండా బీజేపీ పార్టీ ఓటమి దాదాపుగా ఖాయమైనందున డబ్బు వసూలు చేయడానికి ధనిక వ్యాపారులు, కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేయడానికి ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయం Siddaramaiah

రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి బిజెపి ఖాయం అన్నారు. సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నందుకు బీజేపీని, దాని నేతలను టార్గెట్ చేస్తూ, రాబోయే ఎన్నికల్లో తమ ఓటమిని వివరించేందుకు జేపీ నడ్డా నేతృత్వంలోని బిజెపి పార్టీ ఇప్పటికే కుంటి సాకులు వెతుకుతోందని సీఎం విమర్శించారు.

ఇటీవలి ఐటీ శాఖ సోదాల్లో కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు రికవరీ అయిందని, ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం పార్టీకి నిధులు ఇచ్చేందుకు కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ఆదేశాల మేరకు కమీషన్ సొమ్మును వసూలు చేశారన్న బీజేపీ ఆరోపణపై ఆయన స్పందించారు.

కర్ణాటకలో నుండి 40 శాతం కమీషన్: సిద్ధరామయ్య

రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికలలో తమ ఓటమి దాదాపు ఖాయమైనందున బిజెపి మునుపటిలా నిధులను సమీకరించలేకపోయిందన్నారు. అంతేకాకుండా, కర్ణాటకలో దాని అతిపెద్ద మూలమైన 40 శాతం కమీషన్ కూడా ఇప్పుడు ఆగిపోయింది.

కాంగ్రెస్ పార్టీ ధనబలం వల్లే ఓడిపోయామని ఎన్నికల మరుసటి రోజే బీజేపీ

అందుకే ధనిక వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేసేందుకు ఐటీ-ఈడీ దాడులు జరుగుతున్నాయని సిద్ధరామయ్య ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ధనబలం వల్లే ఓడిపోయామని ఎన్నికల మరుసటి రోజే బీజేపీ నుంచి ప్రకటన వెలువడితే ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ వసూలు చేసిన డబ్బు వివరాలే నిదర్శనమని, బీజేపీ పార్టీ తన ఎన్నికల రాజకీయాల కోసం డబ్బును దోచుకుంటుందనడానికి నిదర్శనమని, మార్చి 2018 నుంచి జనవరి 2023 మధ్య కాలంలో రూ.12,008 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను విక్రయించారని ముఖ్యమంత్రి అన్నారు. 5,272 కోట్లు బీజేపీకి చెందినవని సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు.