Home   »  జాతీయం   »   New Parliament |నూతన పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు

New Parliament |నూతన పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు

schedule mahesh

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నిర్మించిన New Parliament లో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. New Parliament లో సమావేశాలు ఈ నెల 18 నుండి 22 వరకు నిర్వహించనున్నట్లు BJP ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశాల్లో BHRATH పేరు పై తీర్మానంతో పాటు జమిలి ఎన్నికలు, బ్రిటిష్‌కాలం నాటి IPC, CRPC, ఎవిడెన్స్‌ య్ర్‌ స్థానంలో తీసుకురాబోయే

కొత్త చట్టాల పై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే ప్రధాని మోదీ ఈ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనాలని

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షడు మల్లికార్జున్ ఖర్గే కి లేఖలు పంపించారు. ఈ సమావేశాల్లో పాల్గొంటామని సోనియా తెలిపారు.

నెల 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో ఇండియా కూటమి పార్టీలు పాల్గొంటాయని కాంగ్రెస్ MP జైరాం రమేష్‌ తెలిపారు.

మేము పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను బహిష్కరించకూడదని నిర్ణయించుకున్నాం. ప్రజల
సమస్యలను లేవనెత్తడానికి ఇదొక అవకాశం.

ఇండియా కూటమి సమావేశంలో జరిగిన చర్చల సారాంశాన్ని వివరిస్తూ సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాస్తారు అని జైరాం రమేష్‌ చెప్పుకొచ్చారు.

అయితే ఈ ప్రత్యేక సమావేశాలలో పార్లమెంట్ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 8వ తేదీ నుంచి జీ20 దేశాల సదస్సు జరగబోతోంది.

ఢిల్లీ వేదికగా జరిగే ఈ సదస్సుకు దేశ, విదేశీ అతిధుల్ని ఆహ్వానించారు. వీరికి పంపిన ఆహ్వన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు పంపారు.

వాస్తవానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వెళ్లాల్సిన ఈ ఆహ్వానాలు కాస్తా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో వెళ్లడంతో అతిధులు కూడా కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు.

తిరిగి దీన్ని నిర్ధారించుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అంటే ఈ ప్రత్యేక సమావేశాలలో ఇండియా పేరును కాస్త భారత్ గా మార్చనున్నారన్నట

దానికోసం ప్రత్యేక చట్టం కూడా రుపొంద్దించినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఇప్పటికే జమిలి ఎన్నికల కోసం మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసారు.

దీని పై కూడా ఈ సమావేశాలలో వాడివేడి చర్చ జరగనుంది.