Home   »  జాతీయం   »   survey of castes |కులాల సర్వే ఫలితాలను విడుదల చేసిన బీహార్ ప్రభుత్వం

survey of castes |కులాల సర్వే ఫలితాలను విడుదల చేసిన బీహార్ ప్రభుత్వం

schedule mahesh

బీహార్ : బీహార్ లోని నితీష్ కుమార్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా చేపట్టిన కులాల జనాభా గణన (survey of castes) సర్వే ఫలితాలను ఈ రోజు బీహార్ ప్రభుత్వం విడుదల చేసింది. బీహార్ రాష్ట్ర మొత్తం జనాభాలో OBCలు, EBCలు అత్యధికంగా 63 శాతం ఉన్నారని వెల్లడించింది.

బీహార్ జనాభాలో అత్యధికంగా 63 శాతం OBCలు, EBCలు

బీహార్ డెవలప్‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ విడుదల చేసిన డేటా ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభా 13.07 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. అందులో అత్యంత వెనుకబడిన తరగతులు 36 శాతం అతిపెద్ద సామాజిక విభాగంగా, ఇతర వెనుకబడిన తరగతులు 27.13శాతం గా ఉన్నాయి.

షెడ్యూల్డ్ కులాలు 19 శాతం, తెగలు (ST) 1.68 శాతం (survey of castes)

బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు చెందిన ఓబీసీ వర్గానికి చెందిన యాదవులు జనాభా పరంగా అత్యధికంగా ఉన్నారని మొత్తం జనాభాలో 14.27 శాతం ఉన్నారని ఈ సర్వే పేర్కొంది.

అలాగే షెడ్యూల్డ్ కులాలు (SC) 19 శాతం కంటే ఎక్కువగా ఉండగా షెడ్యూల్డ్ తెగలు (ST) 1.68 శాతంగా ఉన్నారు. అగ్ర కులాలు జనాభాలో 15.52 శాతం మందిఉన్నట్టుగా తేలారు. బీహార్ లో కుల ఆధారిత సర్వేకు వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. అంతే కాకుండా న్యాయపరమైన సవాళ్లు కూడా బీహార్ ప్రభుత్వానికి ఎదురయ్యాయి. అయినా కానీ బీహార్ ప్రభుత్వం మాత్రం కుల సర్వే నిర్వహించి ఈ రోజు ఫలితాలని విడుదల చేసింది.

సామాజిక న్యాయం అమలు చేయాలంటే కుల గణన సర్వే కీలకం బీహార్ ప్రభుత్వం

రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేయాలంటే కుల గణన సర్వే కీలకమని బీహార్ ప్రభుత్వం పేర్కొంది. ఈ సర్వే కి వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలైనా సుప్రీంకోర్టు మాత్రం నిలిపివేసేందుకు నిరాకరించింది. దీంతో బీహార్లో నితీష్ ప్రభుత్వం ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసింది.

దీని ఫలితాలతో ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలోనూ ఇలాంటి సర్వే చేపట్టాలని డిమాండ్లు మొదలయ్యే అవకాసముంది. జనాభాలో భూమిహార్లు 2.86%, బ్రాహ్మణులు 3.66%, కుర్మీలు 2.87%, ముసాహర్లు 3% మరియు యాదవులు 14% ఉన్నారు.