Home   »  జాతీయం   »   తమిళనాడు వరద బాధితులకు సహాయక చర్యలు ముమ్మరం చేసిన రెస్క్యూ టీమ్

తమిళనాడు వరద బాధితులకు సహాయక చర్యలు ముమ్మరం చేసిన రెస్క్యూ టీమ్

schedule sirisha

చెన్నై:Tamil Nadu flood | గత 24 గంటల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ తమిళనాడు తీవ్ర వరద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బాధిత ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు భారీ రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి.

the rescue operations for Tamil Nadu flood victims

Tamil Nadu flood | గత 24 గంటల్లో వరద బీభత్సం

Tamil Nadu flood | “తమిళనాడులో గత 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిశాయి. దీనివల్ల తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో విస్తృతమైన వరదలు సంభవించాయి. IAF వేగంగా స్పందించి, మానవతా సహాయం, విపత్తు సహాయ కార్యకలాపాలతో సూలూర్‌ వైమానిక దళం స్టేషన్ కు బాధ్యతలు అప్పగించింది. ఇది ప్రస్తుతం MI-17 V5 హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు అందిస్తున్నట్లు” భారత వైమానిక దళం ‘X’ పోస్ట్‌లో పెట్టింది.

తూత్తుకుడిలోని వాసవప్పపురం ప్రాంతంలో వరద బాధిత ప్రజలను భారత సైన్యం ముందస్తు చర్యల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా రక్షించగలిగింది. తమిళనాడులోని వాసవప్పపురం వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 118 మందిని రక్షించామని సైన్య అధికారి తెలిపారు.

రిలీఫ్ కాలమ్ యాక్టివేట్ చేసిన ఇండియన్ ఆర్మీ

“తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఈరోజు తమిళనాడులోని వసాయిపురంలో ఇండియన్ ఆర్మీ రిలీఫ్ కాలమ్ యాక్టివేట్ చేశారు. రాత్రి 9:30 గంటల వరకు మొదటి కాలమ్ ద్వారా 17 మంది మహిళలను, పిల్లలను మరో 13 మందిని ఖాళీ చేయించాము. రెండవ కాలమ్‌లో ఒక గర్భిణీ స్త్రీ, 6 మంది పిల్లలు, ఒక శిశువును ఇంకా 12 మంది ఇతరులతో సహా 12 మంది మహిళలను ఖాళీ చేయించాము. అదే సమయంలో 26 మంది మహిళలు, 10 మంది పిల్లలు మరియు 28 మందిని మూడవ కాలమ్ ద్వారా ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు పంపించాము” అని భారత సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.

వరదల పరిస్థితిపై సమీక్షా సమావేశం

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) అధికారులు ఈరోజు తెల్లవారుజామున తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో సహాయక చర్యలను ప్రారంభించారు. తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దక్షిణ తమిళనాడులో వరదల పరిస్థితిపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, పర్యవేక్షణ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారని తెలిపారు.

ఒంటరిగా ఉన్న ప్రజలను రక్షించేందుకు మీనా సాయుధ దళాల నుండి సహాయాన్ని కోరారు. తమిళనాడులో మునుపెన్నడూ లేని విధంగా వరదలు, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సహాయం కోసం పిలిపించినట్లు ఆయన వెల్లడించారు.

అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న CM స్టాలిన్

అంతకుముందు రోజు ముఖ్యమంత్రి MK స్టాలిన్ మాట్లాడుతూ, వర్ష ప్రభావిత జిల్లాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో సహకరించాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్లు తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి చెప్పారు.

తమిళనాడులోని తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి మరియు తెన్కాసి వంటి కొన్ని జిల్లాల్లో ఆదివారం ఉదయం నుండి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వరదలు సంభవించటం వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. కన్యాకుమారి నగరంలోని పలు ప్రాంతాలు కూడా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.

Also read: తమిళనాడులో భారీ వర్షాలు.. 4 జిల్లాల్లో ముందస్తు చర్యలు