Home   »  జాతీయం   »   Terrorist |హిందువులను బెదిరించిన ఖలిస్తాన్ ఉగ్రవాది పై NIAఉక్కుపాదం

Terrorist |హిందువులను బెదిరించిన ఖలిస్తాన్ ఉగ్రవాది పై NIAఉక్కుపాదం

schedule mahesh

PANJAB : చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద చండీగఢ్, అమృత్‌సర్‌లలో నిర్మించబడిన ఖలిస్తానీ ఉగ్రవాది (Terrorist) గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జప్తు చేసింది.

(Terrorist ) గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను జప్తు చేసిన NIA

పంజాబ్ రాష్ట్రం చండీగఢ్‌లోని సెక్టార్ 15లో పన్నూన్ ఇంటి ముందు NIA ఆస్తి జప్తు నోటీసుని అతికించింది. ఈ నోటీసులో ప్రకటిత నేరస్థుడు అయిన గురుపత్వంత్ సింగ్ పన్ను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డాడని.

కావున NIA చట్టంలోని సెక్షన్ 33(5) ప్రకారం తన ఇంటిని, ఆస్తులని జప్తు చేయడమైనది. అమృత్‌సర్‌లోని అతని పూర్వీకుల గ్రామమైన ఖాన్‌కోట్‌లో నిషేధిత సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన వ్యవసాయ భూమి పై NIA మరో నోటీసు ఇచ్చింది.

పంజాబ్‌లోని మొహాలీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ఇంటి బయట NIA నోటీసు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2020 జూలైలో పన్నూన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతే కాకుండా పంజాబ్ లోని జలంధర్ జిల్లా భర్సింగ్ పురా గ్రామంలో ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ ఇంటి బయట కూడా NIA ఇదే విధమైన నోటీసును అతికించారు.

భారతదేశం నిషేధించిన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ సిక్కు తీవ్రవాద సంస్థ నియమించబడిన ఉగ్రవాది ఈ జూన్‌లో కెనడాలోని సర్రేలో కాల్చి చంపబడ్డాడు. కెనడా పార్లమెంట్‌లో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ ఈ జూన్‌లో కెనడియన్ గడ్డ పై జరిగిన హత్య వెనుక భారత్ పాత్ర ఉందని ఆరోపించిన తర్వాత భారతదేశం, కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.