Home   »  జాతీయం   »   దీపావళికి సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

దీపావళికి సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

schedule sirisha

హైదరాబాద్: రాముడు రావణాసురుని చంపినందుకు ప్రతీకగా ప్రజలు దీపావళి (Diwali) పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే దీపావళి పండుగకి తెలంగాణ ప్రభుత్వం సెలవును ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం, రాష్ట్రంలో నవంబర్ 12న దీపావళి సెలవుదినం జరుపుకుంటారు. ఈ రోజు ‘సాధారణ సెలవులు‘ క్రింద జాబితాలో చేర్చారు. అయితే నవంబర్ 12 ఆదివారం నాడు వస్తుంది.

గురునానక్ జయంతి కోసం సెలవు

అంతే కాకుండా ఈ నెలలో తెలంగాణలో గురునానక్ జయంతి మరియు నరక చతుర్థి సందర్బంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. అయితే దీపావళి మరియు గురునానక్ జయంతి సెలవులను మాత్రమే ‘జనరల్ హాలిడేస్’ కింద ప్రకటించారు. ఈ సంవత్సరం గురునానక్ జయంతి నవంబర్ 27 న వస్తుంది.

తెలంగాణలో పాఠశాలలకు దీపావళి (Diwali) సెలవు

తెలంగాణలో దసరా సెలవుల కారణంగా 13 రోజుల పాటు మూతపడిన పాఠశాలలు దీపావళి రోజున ఒక్కరోజు మాత్రమే మూసివేస్తారు.

నవంబర్ 12న రాష్ట్రంలోని పాఠశాలలకు దీపావళి సెలవులు ఇవ్వనున్నారు. కాగా ఆ రోజు ఆదివారం కావడంతో సాధారణ సెలవు కింద వస్తుంది. దీంతో పాటు గురునానక్ జయంతి సెలవు కారణంగా నవంబర్ 27న కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Also read : జియో నుంచి అదిరిపోయే ఆఫర్… రూ. 2599లకే 4G ఫోన్