Home   »  జాతీయం   »   Vadodara boat accident | విహారయాత్రలో విషాదం.. 16 మంది పాఠశాల విద్యార్థులు మృతి

Vadodara boat accident | విహారయాత్రలో విషాదం.. 16 మంది పాఠశాల విద్యార్థులు మృతి

schedule ranjith

వడోదరలో పడవ బోల్తా ఘటనలో 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు.ఈ దుర్ఘటనతో విద్యార్థులు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Vadodara boat capsize | Tragedy in vacation.. 16 school students died

జనవరి 18న వడోదరలోని హరిని మోత్నాథ్ సరస్సులో పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది పాఠశాల విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

వడోదరలోని హరిని మోత్నాథ్ సరస్సులో ప్రమాదం

వడోదరలోని హరిని మోత్నాథ్ సరస్సులో పాఠశాల విద్యార్థులు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. NDRF బృందం సహాయక చర్యలు చేపట్టింది మరియు ఇప్పటివరకు 20 మందిని రక్షించింది. ఈ ఘటన నేపథ్యంలో వడోదరలో పడవ బోల్తా పడి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Vadodara boat accident

మరోవైపు గుజరాత్ CM భూపేంద్ర పటేల్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. CM కూడా విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా CM భూపేంద్ర పటేల్ వడోదర SSG ఆస్పత్రిలోని పోస్టుమార్టం కేంద్రాన్ని సందర్శించారు. పడవ బోల్తా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు.

Also Read: Warangal Crime news | ప్రాణం తీసిన అగ్గిపెట్టె గొడవ