Home   »  జాతీయం   »   Rajasthan | 100 అడుగుల బోరుబావిలో పడ్డ మహిళ

Rajasthan | 100 అడుగుల బోరుబావిలో పడ్డ మహిళ

schedule ranjith

రాజస్థాన్ | 25 ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తు 100 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన ఘటన రాజస్థాన్​లో జరిగింది. ఆమెను రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గంగాపుర్​ జిల్లా కలెక్టర్​ డాక్టర్​ గౌరవ్​ సైనీ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగుతోంది.

Rajasthan | A woman who fell into a 100 feet bore well

ప్రమాదవశాత్తు 25 ఏళ్ల మహిళ 100 అడుగులు లోతున్న బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటన రాజస్థాన్​ (Rajasthan)లోని గంగాపూర్​ జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF)​ బృందాలను రంగంలోకి దింపారు. గంగాపుర్​ జిల్లా కలెక్టర్​ డాక్టర్​ గౌరవ్​ సైనీ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగుతోంది.

కలెక్టర్​ డాక్టర్​ గౌరవ్​ సైనీ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్​ (Rajasthan)

జిల్లాలోని గుడా గ్రామానికి చెందిన 25 ఏళ్ల మోనా భాయి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో బుధవారం ఇంటివెనక పొలంలో ఉన్న బోరుబావి సమీపంలో కుటుంబ సభ్యులు ఆమె చెప్పులను గుర్తించారు. దీంతో మోనా బోరుబావిలో పడిపోయి ఉంటుందనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మోనా భాయి బోరుబావిలో ఉంది అని గమనించి రెస్క్యూ ఆపరేషన్​ మొదలుపెట్టారు.

Also Read: Gujarat: బోరుబావి నుంచి రక్షించబడిన మూడేళ్ల బాలిక మృతి..