Home   »  జాతీయం   »   UPలో డిజిటల్ డాక్టర్ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్న యోగి ప్రభుత్వం

UPలో డిజిటల్ డాక్టర్ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్న యోగి ప్రభుత్వం

schedule mahesh

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరిచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Yogi Govt) గ్రామీణ ప్రాంతాల్లో ‘డిజిటల్ డాక్టర్ క్లినిక్’లను ఏర్పాటు చేయబోతుంది. ఈడిజిటల్ డాక్టర్ క్లినిక్‌లుప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వలె పని చేయనున్నాయి.

డాక్టర్ క్లినిక్ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 20 కేంద్రాలలో ఏర్పాటు

క్లినిక్ లలో ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా వైద్యుల సంప్రదింపులు మాత్రమే కాకుండా, ప్రయోగశాల సౌకర్యాలతో పాటు మందులు కూడా అందుబాటులో వుంటాయి.ఈ డిజిటల్ డాక్టర్ క్లినిక్ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా లక్నో మరియు బులంద్‌షహర్‌లోని మొత్తం 20 కేంద్రాలలో త్వరలో తెరవబడుతుందని వెల్లడించారు.

ఆ తర్వాత రాష్ట్రమంతటా విస్తరిస్తామన్నారు. ప్రయివేటు పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

యోగి ప్రభుత్వం (Yogi Govt) ఓబ్దు గ్రూప్‌తో 350 కోట్ల అవగాహన ఒప్పందం

తద్వారా ప్రజలు తీవ్రమైన అనారోగ్యాల కోసం రాయితీ ధరలకు వైద్య సలహాలు, మందులు మరియు పాథాలజీ పరీక్షలను పొందవచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం యోగి ప్రభుత్వం ఓబ్దు గ్రూప్‌తో రూ. 350 కోట్ల అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శంకుస్థాపన వేడుకకు ముందే ఓబ్డు గ్రూప్ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంది.

ఇందు కోసం ఐదుగురు వైద్యులను నియమించగా మరో 10 మంది వైద్యులను క్యూలో ఉంచుతున్నట్లు ఓబ్దు గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో సంజయ్ కుమార్ తెలిపారు. స్టార్టప్‌కు సంబంధించి మరికొందరు పెట్టుబడిదారులతో తాము చర్చలు జరుపుతున్నామని, ఈ ఎంఓయూని రూ. 1,000 కోట్ల వరకు పెంచడమే తమ లక్ష్యమని సీఈఓ పేర్కొన్నారు.